Begin typing your search above and press return to search.

ఫేక్ న్యూస్ ఎఫెక్ట్..ఆ జ్యూయలరీస్‌ కు కోట్ల నష్టం

By:  Tupaki Desk   |   12 July 2018 6:44 AM GMT
ఫేక్ న్యూస్ ఎఫెక్ట్..ఆ జ్యూయలరీస్‌ కు కోట్ల నష్టం
X
ప్రపంచాన్ని భయపెడుతున్న అతి పెద్ద సమస్యల్లో ఫేక్ న్యూస్ ఒకటి. ఈ రోజు దీని ప్రభావం ఎంతుందో చెప్పడానికి ఇటీవల పిల్లలను ఎత్తుకుపోతున్నారన్న ఫేక్ న్యూస్ ను నమ్మి దేశంలో పదుల సంఖ్యలో అమాయకులను కొట్టి చంపడమే దీని వికృత రూపానికి ఉదాహరణ. ఇదొక్కటే ఫేక్ న్యూస్ ఎన్నోరకాలుగా సమాజానికి, వ్యక్తులకు, సంస్థలకు నష్టం కలిగిస్తోంది. తాజాగా ఫేక్ న్యూస్ దెబ్బకు ఓ నగల దుకాణం ఏకంగా 500 కోట్ల మేర నష్టపోయినట్లు చెబుతోంది. అవును... దేశవ్యాప్తంగా బ్రాంచిలున్న కల్యాణ్ జ్యూయలరీస్ కు దుబాయి వంటి పలు ఇతర దేశాల్లోనూ బ్రాంచిలున్నాయి. దుబాయిలోని ఆ నగల దుకాణంలో నకిలీ బంగారాన్ని పట్టుకున్నారంటూ నకిలీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వ్యాప్తి చెందడంతో కల్యాణ్ జ్యూయలరీస్ వ్యాపారం ఒక్కసారిగా పడిపోయింది.

దుబాయిలోని ఓ నగల దుకాణంలో కొన్నాళ్ల కిందట అధికారులు తమ నిత్య విధుల్లో భాగంగా తనిఖీలు చేశారు. కానీ... కొందరు ఆ వీడియోలకు కల్యాణ్ జ్యూయలరీస్ లోగోలను యాడ్ చేసి కల్యాణ్ జ్యూయలరీస్ లోనే దాడులు జరిగి నకిలీ బంగారం పట్టుకున్నారంటూ మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. అది వైరల్ కావడంతో అంతా నిజమని నమ్మారు. ఫలితంగా కల్యాణ్ లో బంగారం కొనడానికి వెనుకాడారు. దీంతో వ్యాపారం దెబ్బతింది.

దీంతో కేరళకు చెందిన ఈ నగల సంస్థ ఆ రాష్ట్ర హైకోర్టను ఆశ్రయించింది. ఇలాంటి తప్పుడు వార్తలపై నియంత్రణ పెట్టాలిని కోరింది. అందుకు కోర్టు సానుకూలంగా స్పందిస్తూ ఇలాంటి ఫేక్ న్యూస్ ను అరికట్టేలా ఒక మెకానిజం రూపొందించాల్సిన అవసరం ఉందని చెప్పింది.