Begin typing your search above and press return to search.
చిరంజీవికి రాజ్యసభ ఇస్తారట..అంతా బుస్...!
By: Tupaki Desk | 17 Oct 2019 10:56 AM GMTమెగాస్టార్ చిరంజీవి మూడు రోజుల క్రితం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే. తను నటించిన సైరా సినిమా ప్రమోషన్ లో భాగంగా చిరంజీవి - సీఎంని కలిశారు. సినిమా గురించి ముఖ్య విషయాలని చెప్పి - సినిమా చూడాలని జగన్ ని కోరారు. ఇక దీనికి సానుకూలంగా స్పందించిన జగన్ సైరా చూస్తానని చెప్పారు. ఆయన త్వరలోనే సైరా సినిమా చూసే అవకాశం ఉంది. అయితే వారిద్దరు భేటీ సైరా సినిమాకే పరిమితమైంది. కానీ ఈ భేటీలో రాజకీయాలు గురించి మాట్లాడారని వార్తలు వస్తున్నాయి.
అందులో భాగంగా సీఎం జగన్...చిరంజీవికి రాజ్యసభ సీటు ఆఫర్ చేశారని - మళ్ళీ పార్లమెంట్ కు వెళ్లాలని ఆసక్తి ఉంటే రాజ్యసభ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని జగన్ చెప్పినట్లు ప్రచారం జరిగింది. అలాగే దీనికి చిరంజీవి వైపు నుంచి ఎలాంటి సమాధానం రాలేదని వార్తలు వచ్చాయి. అయితే ఇదంతా ఉత్తి ప్రచారమే. అసలు వారి మధ్య రాజకీయాల గురించే చర్చే జరగలేదు. జగన్ రాజ్యసభ సీటు ఇస్తానని అసలు చెప్పలేదు. అసలు ఇదొక పెద్ద గాలి వార్త. వాళ్ళు సినిమా గురించి మాట్లాడుకుంటే రాజకీయాలకు ముడిపెట్టేశారు.
కాగా, చిరంజీవి 2009లో ప్రజారాజ్యం పెట్టి - తర్వాత పార్టీని కాంగ్రెస్ లో కలిపేసిన విషయం తెలిసిందే. ఇక ఆయన కాంగ్రెస్ తరుపున రాజ్యసభ సభ్యుడుగా ఎంపికై 2012-2014 మన్మోహన్ సింగ్ కేబినెట్ లో కేంద్ర మంత్రిగా పని చేశారు. తర్వాత చిరంజీవి రాజ్యసభ పదవి కాలం ముగియడంతో ఆయన రాజకీయలోకి పూర్తిగా దూరమైపోయారు. రాజకీయాలు వదిలేసి సినిమాలు వైపు వచ్చేసి మళ్ళీ ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు సైరా సినిమాతో సందడి చేస్తున్నారు.
ఇక రాయలసీమ ప్రాంతానికి చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సైరాలో నటించిన చిరు ఈ సినిమాను పలువురు ప్రముఖులను చూడమని ఆహ్వానిస్తున్నాడు. ఈ క్రమంలోనే జగన్ తో పాటు తెలంగాణ గవర్నర్ - ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇలా ప్రతి ఒక్కరిని కలుస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ తో భేటీ అయితే కొందరు రాజ్యసభ అంటూ కథలు అల్లేశారు. ఇక చిరు మోది - అమిత్ షాను కలుస్తున్నారు. అలా అయితే ఆయన బీజేపీలోకి వెళ్లి.... రాజ్యసభకు ఎంపికై... కేంద్ర మంత్రి అవుతారని మళ్లీ కథలు అల్లేస్తారేమో..?