Begin typing your search above and press return to search.
యుద్ధ సమయంలో కూడా పేట్రేగిపోతున్న ఫేక్ న్యూస్..!
By: Tupaki Desk | 10 March 2022 2:58 AM GMTప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం హాట్ టాపిక్ అంటే పక్కాగా అది ఉక్రెయిన్, రష్యా యద్ధమే. ఇంతకు మించిన హాట్ టాపిక్ మరేది లేదనే చెప్పాలి. రష్యా, ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించి నేటి 15 రోజులు కావొస్తుంది. ఎక్కడా ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం చల్లారినట్లు కనిపించడం లేదు. రోజు రోజుకు శవాల గుట్టలు పెరిగిపోతున్నాయి. రష్యా కచ్చితంగా ఉక్రెయిన్ ను ఆక్రమించుకునే వెనకడుగు వేసేలా కనిపించడం లేదు. రోజు రోజుకు ఆయుధ, క్షిపణి దాడులతో నగర వాసులను బెంబేలిస్తున్నారు.
మరో వైపు చాలా మంది ప్రజలు ఉక్రెయిన్ ను విడిచి సరిహద్దు దేశాలకు వలస పోతున్నారు. ఇదిలా ఉంటే ఇంతటి యుద్ధ సమయంలో కూడా సామాజిక మాధ్యమాల్లో ఫేక్ న్యూస్ అనేది హల్ చల్ చేస్తుంది. దేశాలు దాటుకుంటూ.. ఒక దాని తరువాత ఒకటి ఇలా లెక్క లేనన్ని పుట్టుకుని వస్తున్నాయి. ఇది వార్ లో భాగం అని కొందరు అంటుంటే.. ఉక్రెయిన్ వాసులను మానసికంగా దెబ్బ తీసే చర్యల్లో ఇది భాగం అని మరి కొందరు విశ్లేషిస్తున్నారు.
ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్, ట్విటర్, ఫేస్ బుక్, టిక్ టాక్ లాంటి సామాజిక మాధ్యమాల్లో ఫేక్ న్యూస్ అనేది ఓ రేంజ్ ల ప్రజలను చుట్టేస్తుంది. ఉక్రెయన్ లో ఉన్న వారిలో చాలా మంది ఇన్‌స్టాగ్రామ్ తెరిచి చూడడం మొదలుపెట్టారంటే వారికి యుద్ధానికి సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలు, పోస్టులన్నీ కనిపిస్తున్నాయి. అయితే వాటిలో నిజాలు తక్కువగా ఉంటున్నాయి. పక్కన జరిగిన విషయాన్ని కూడా కొందరు కావాలని ఫేక్ న్యూస్ ను క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా యుద్ధ సమయంలో ఉక్రెయిన్ లను మానసికంగా దెబ్బతీసేందుకు ఇలా చేస్తున్నారు. భయం గుప్పెట్లో ప్రాణాలను అర చేతిలో పట్టుకుని బంకర్లలో తల దాచుకుంటున్న ఉక్రెయిన్ లకు ఈ వాస్తవాలతో పాటు తప్పుడు సమాచారం ఇంకా ఎక్కువగా బయటకు వచ్చి వారిని మరింత ఆందోళనకు గురి చేస్తుంది.
ఈ ఫేక్ న్యూస్ ఎంతా సామాజిక మాధ్యమాలను చుట్టి వేస్తుందంటే.. కొందరు అయితే ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ ల మధ్య జరుగుతున్న యుద్ధం అంతా నిజం కాదని.. బూటకమని రకరకలుగా ఉక్రెయిన్ లను నమ్మించేందుకు ఇలాంటి పోస్ట్ లు చేస్తున్నారు. ఇలా వచ్చిన వాటిని చూసిన ఆ అకౌంట్ల వారిని బ్లాక్ చేస్తే మరలా వారు ఇంకో నంబర్ తో లేడీ ఫోటోలు పెట్టుకుని ఇలాంటి వాటికి మరలా పాల్పడుతున్నారు. అందులోనూ వీరంతా ఎక్కువ మంది ఎదుటివారితో రష్యన్ లోనే మాట్లాడుతున్నారు.
ఇదే తంతు టెలిగ్రామ్ లో కూడా కొనసాగుతుంది. దీనిలో అయితే వచ్చే ఎక్కువ పోస్టులు రష్యన్ లోనే కనిపిస్తున్నాయని స్థానికులు చెప్తున్నారు. చుట్టుక పక్కల దాడులు జరిగినా కానీ... కచ్చితంగా ఇవి నిజం కాదని ఆ పోస్టుల్లో చెప్తున్నారు. అయితే రష్యా నెటిజన్లు ఈ యుద్ధ సమయానికి మరింత యాక్టివ్ గా ఉంటున్నట్లు కొందరు చెప్తున్నారు. వారి ఇతరులతో చేసే చాట్లను వెతికి మరీ ఫ్రాడ్ పనులు చేస్తున్నట్లు వివరిస్తున్నారు. మరో వైపు పాత పుటేజ్ లను కూడా వారి వాడుకుంటున్నట్లు గుర్తించారు. గతంలో ఎప్పుడో జరిగిన వాటిని తీసుకుని ప్రస్తుతం ఫలానా ప్రాంతంలో ఇలా జరుగుతుంది అని వైరల్ చేస్తున్నారు.
ఇయితే దీనిపై వస్తున్న విమర్శనలు కంపెనీలు కొట్టి పారేయడం లేదు. ఫేక్ న్యూస్ ను అరికట్టేందుకు సాధ్యమైనన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్తున్నారు. కానీ ఎక్కడో ఒక చోట నుంచి వస్తున్నాయని వివరించారు.