Begin typing your search above and press return to search.
ఓటుకు నోటు.. దొంగ నోట్ల పోటు!
By: Tupaki Desk | 9 April 2019 10:50 AM GMTనోటుకి ఓటును అమ్ముకోవడం ఎంత ప్రమాదకరమో చాటి చెబుతున్న విషయం ఇది. రాజకీయ నేతలు ఓటుకు మూడు, నాలుగు, ఐదు వేల రూపాయలు ఇస్తున్న ఈ తరుణంలో దొంగనోట్ల ముఠాలకు కూడా పని దొరికినట్టుగా ఉంది. ఒకవైపు భారీ ఎత్తున ఓటుకు నోట్లను పంచుతున్న వైనం బట్టబయలు అవుతూ ఉంది. ప్రాంతాన్ని బట్టి, నియోజకవర్గాన్ని బట్టి, అక్కడ ఉన్న పోటీని బట్టి భారీగా డబ్బుల పంపకాలు సాగుతూ ఉన్నాయి.
ప్రత్యేకించి ఈ విషయంలో అధికార పార్టీదే హవా అనే మాట వినిపిస్తోంది. అధికారంలో ఉన్న వాళ్లే సాధారణంగా భారీ ఎత్తున ఓటుకు నోట్లను పంచగలరు. ఇప్పుడు ఏపీలో కూడా అదే జరుగుతున్న దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. ఓటుకు నోట్లను పంచడంలో తెలుగుదేశం పార్టీ ఆరితేరిందనే టాక్ వినిపిస్తూ ఉంది.
ఇలాంటి పరిణామాల మధ్యన ఓట్లకు ఇస్తున్న నోట్లకు భారీగా దొంగనోట్ల పంపకం కూడా సాగుతోందనే మాట వినిపిస్తూ ఉంది. ఎలాగూ ఇప్పుడు పెద్ద నోట్లతోనే పనంతా. ఓటుకు రెండు వేల రూపాయల నోటు నిష్పత్తితో రేటు కడుతూ ఉన్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఓటుకు రెండు రెండు వేల రూపాయల నోట్లను చేతిలో పెడుతూ ఉన్నారు.
వాటిల్లో చాలా వరకూ దొంగనోట్లుగా తేలుతూ ఉన్నాయని క్షేత్ర స్థాయిలో టాక్ వినిపిస్తోంది. ఓటుకు ఇచ్చారని ఆనందంగా ఆ రెండు వేల రూపాయల నోట్లను తీసుకుని.. వాటిని అవసరాల కోసం మార్చడానికి వెళ్లిన వారికి చుక్కలు కనిపిస్తున్నాయి.
వాటిల్లో చాలా వరకూ దొంగ నోట్లు ఉండటంతో.. సంచి లాభం చిల్లు దొబ్బినట్టుగా అవుతోంది. దీంతో ఓటుకు నోటు తీసుకున్న వారు బేర్ మంటున్నారు. అయితే ఇంకా పోలింగ్ కు సమయం ఉంది. ఈ లోపే నోట్లను మార్చడానికి వెళ్లిన వారికి ఈ అనుభవం ఎదురవుతూ ఉంది. మరి ఓటుకు నోటు తీసుకుని..వాటిని భద్రంగా పెట్టుకున్న వాళ్లు వాటిని ఒకసారి చెక్ చేసుకుని తర్వాత ఓటు వేయాలేమో!