Begin typing your search above and press return to search.
'పోకేమాన్ గో' యాప్ తో మరో తలనొప్పి
By: Tupaki Desk | 18 July 2016 10:30 PM GMT‘‘పోకేమాన్ గో’’.. ఈ గేమింగ్ యాప్ ఇప్పుడు ప్రపంచాన్ని ఊపేస్తున్న సంగతి తెలిసిందే. సాధారణంగా ఏ గేమ్ అయినా కూడా వర్చువల్ గానే ఆడుతారు. కానీ.. పోకేమాన్ గో గేమ్ మాత్రం వర్చువల్ కాకుండా రియల్ గా ఆడాల్సి ఉంటుంది. అంటే... ఇది ఆడుతుంటే జీపీఎస్ ఆధారంగా పరిసరాల్లోని లొకేషన్లను చూపిస్తుంది.. అక్కడికి వెళ్లి గేమ్ లెవెల్స్ చేరాల్సి ఉంటుంది. ఆ లొకేషన్ కు నేవిగేషన్ కూడా చూపిస్తుంది. దీంతో ఇది ఆడుతున్నవారు... ఆడుతూఆడుతూ అలా వెళ్లిపోతూ ప్రమాదాలకు గురవుతున్నారు. అదేసమయంలో ఇది పోలీస్ స్టేషన్లు వంటి లొకేషన్లు కూడా చూపిస్తుండడంతో ఆ గేమ్ కు అడిక్టయినవారు ఆ స్టేషన్లలోకి ఎంటరైపోతున్నారు. దీంతో పోలీసులుకు ఇది పెద్ద తలనొప్పిగా మారిపోయింది. దీంతో ఇక్కడ పోకేమాన్ ఆడరాదంటూ కొన్ని దేశాల్లో పోలీసు స్టేషన్లు - బ్యాంకులు - ఆసుపత్రుల వద్ద బోర్డులు కూడా పెడుతున్నారట. అంతాగా కలకలానికి కారణమవుతున్న పోకేమాన్ గేమ్ తో మరొ కొత్త తలనొప్పి కూడా వస్తోందట. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ డౌన్ లోడ్ చేస్తే భయంకరమైన వైరస్ అటాక్ అయి ఫోన్ పనిచేయడం మానేయడమే కాకుండా మన డాటా మొత్తం తస్కరణకు గురవుతోందట.
'పోకేమాన్ గో' యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో వైరస్ తో నిండిపోయిందని సాఫ్ట్ వేర్ సెక్యూరిటీ కంపెనీ ఈసెట్ ప్రకటించింది. 'పోకేమాన్ గో అల్టిమేట్' పేరిట కనిపించే ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుంటే, గేమ్ రాదు సరికదా, 'పీఎల్ నెట్ వర్క్' పేరిట ఓ వైరస్ యాప్ ఇన్ స్టాల్ అయి - మొబైల్ లోని సమాచారాన్ని తస్కరిస్తుందట. దీంతో స్మార్ట్ ఫోన్ పూర్తిగా ఫ్రీజ్ అయిపోతుందని, పదేపదే రీస్టార్ట్ చేయాల్సి వస్తుందని, అది కూడా బ్యాటరీని తొలగించి రీస్టార్ట్ చేయాలని, ఆపై మాయమైనట్టు కనిపించే పీఎల్ నెట్ వర్క్ - బ్యాక్ గ్రౌండ్ లో ఉండి తప్పుడు యాడ్స్ సృష్టిస్తుందట.
ఇలా బ్యాక్ గ్రౌండ్ లో రన్ అవుతూ మొబైల్ వ్యాలట్లలోని డబ్బును కొల్లగొట్టడానికి.. వినియోగదారుల సమాచారాన్ని దొంగిలించడానికి ఆస్కారమిస్తుందని నిపుణులు చెబుతున్నారు. సో... ఆడడానికి బాగున్నా అనర్థాలు ఎక్కువగా ఉన్న పోకేమాన్ గో గేమ్ కు దూరంగా ఉండడం బెటరని సూచిస్తున్నారు.