Begin typing your search above and press return to search.
నకిలీ పోలీస్ గుట్టురట్టు .. పోలీస్ కమిషనర్ గా ప్రముఖులనే !
By: Tupaki Desk | 6 Aug 2021 11:32 AM GMTప్రజలను మోసగించి వారి పూట గడుపుకునే కేటుగాళ్లు రోజుకో అవతారంలో బయటికి వస్తున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని, నకిలీ ఐడీ కార్డులు క్రియేట్ చేసి అమాయకులను మోసం చేస్తున్నారు. తాజాగా ఇలాంటి మోసగాడి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఏకంగా పోలీసు కమిషనర్‌గా అవతారమెత్తిన ఆ ఫేక్‌గాడు అందరినీ బెదిరించి డబ్బులు జుంగడం మొదలుపెట్టాడు. చివరకు వాహనాల తనిఖీలో పోలీసులకు చిక్కి ఇప్పుడు కటకటాలు లెక్కపెడుతున్నాడు. రద్దీ తక్కువగా ఉండే రోడ్లను చూస్తారు. అదును చూసి వారి ఫేక్ ప్రతిభ చూపిస్తారు. అందినకాడికి దోచేస్తారు. ఇది ఆ ఫేక్ పోలీసుల స్టైల్. పోలీసుల తనిఖీలో అయ్యగారి భాగోతం బయటపడింది.
ఆయనో నకిలీ పోలీస్ కమిషనర్. ఐడీ కార్డు, సైరన్‌తో కూడిన పోలీస్ వాహనం, యూనిఫాం అన్నీ నకిలీవే. అసలు పోలీసులతో సమానంగా చలామణి అవడమే కాకుండా అడ్డగోలుగా సంపాదించాడు. చివరకు వాహనాల తనిఖీలో పోలీసులకు పట్టుబడ్డాడు. చెన్నైకి చెందిన విజయన్ కు గతంలో లారీల వ్యాపారం చేసేవాడు. అందులో నష్టం రావడంతో ఏ పనీ చేయకుండా ఇంటి వద్దనే ఉంటున్నాడు. తిని కూర్చుంటే కుటుంబం గడిచేదెలా అంటూ భార్య సూటిపోటి మాటలు అంటుండటంతో రూటు మార్చాడు. తాను గ్రూప్–1 పాసై డీఎస్పీ అయ్యానని, ఇటీవలే పోలీస్ కమిషనర్ గా ప్రమోషన్ కూడా వచ్చిందని అందరినీ నమ్మించాడు. ఆ తర్వాత స్నేహితురాలి సహకారంతో జీప్ కొనుగోలు చేసి దానికి సైరన్ ఏర్పాటు చేసుకున్నాడు.
కేసుల విచారణకు వెళ్తున్నట్లు భార్యకు చెప్పి ఇంట్లో నుంచి బయటకు వచ్చేవాడు. పోలీస్ అధికారినంటూ పలువురిని బెదిరించి డబ్బులు గుంజాడు. చివరకు పోలీస్ కమిషనర్ గెటప్ లో జీపులో దర్జాగా వెళ్తుండగా తమిళనాడులోని దిండుగల్ జిల్లా లక్ష్మీపురం టోల్ గేట్ వద్ద పోలీసుల తనిఖీల్లో అతని బండారం బట్టబయలైంది. దీంతో పోలీసు వాహనం, నకిలీ ఐడీ కార్డు, యూనిఫాం, తుపాకీ స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు. అయితే దర్యాప్తులో పోలీసులకు మరిన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని రాజకీయ ప్రముఖులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో విజయన్ దిగిన ఫొటోలు చూసి పోలీసులు షాకయ్యారు. వీటిలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుతో సైతం సన్నిహితంగా తీసుకున్న ఫోటో బయటపడింది. కిరణ్ బేడీ, వీరప్ప మొయిలీ లాంటి ప్రముఖులతోనూ అతడు ఫోటోలు దిగాడు. తాను ఓ ప్రైవేట్ న్యూస్ చానల్ లో విలేకరిగా పనిచేసేటపుడు వారితో ఫొటోలకు దిగినట్లు నిందితుడు విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. ఈ కేసు విచారణ సమయంలో పలువురు ప్రముఖులు ఫోన్లు చేసి ఒత్తిడి తీసుకొచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. తాను ప్రముఖులతో దిగిన ఫోటోలను అడ్డం పెట్టుకుని విజయన్ ఎవరినైనా మోసం చేశాడా, అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.