Begin typing your search above and press return to search.
ఏపీలో ఇప్పుడు 'ఫేక్' పాలిటిక్స్
By: Tupaki Desk | 21 Jan 2023 2:30 AM GMT''ఇప్పటి వరకు ఏపీలో సాగిన రాజకీయాలు ఒక ఎత్తు అయితే.. ఇప్పటి నుంచి సాగేవి మరో ఎత్తు'' అని టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా చెప్పుకొచ్చారు. అంతేకాదు.. వైసీపీ నేతలను చెప్పుతో కొట్టాలని కూడా సంచలన పిలుపునిచ్చారు. ఇది ఎన్నికల ముందు రాజకీయాలను మరింత హీటెక్కేలా చేసింది. అయితే.. అసలు ఏం జరుగుతోంది? అనే చర్చ ఏంటంటే..
ఏపీలో ఇప్పటి వరకు ప్రతిపక్షం టీడీపీపై మంత్రులు.. వైసీపీ నాయకులు ప్రత్యక్షంగా విరుచుకుపడడం .. కామెంట్లు చేసుకోవడం తెలిసిందే. ఇక, ఒకవైపు మహానాడు నిర్వహిస్తే.. మరోవైపు వైసీపీ నాయకులు బీసీ యాత్ర పేరిట హల్చల్ చేశారు. ఇలా.. పోటా పోటీ కార్యక్రమాలు నిర్వహించారు. ఇక, అమరావతిని సమర్ధిస్తూ.. రైతులు పాదయాత్ర చేస్తే.. మూడు రాజధానులు కావాలంటూ.. మంత్రులు(సీదిరి అప్పలరాజు, గుడివాడ అమర్నాథ్) పాదయాత్రకు రెడీ అయ్యారు.
ఇక, కేసులు పెట్టుకోవడం.. కోర్టులకు వెళ్లడం.. ఒకరినొకరు బూతులు తిట్టుకోవడం.. విమర్శలు చేసుకోవ డం.. ఇప్పటి వరకు జరిగిన రాజకీయం. అయితే..ఇప్పుడు వైసీపీ రూటు మార్చిందని టీడీపీ చెబుతోంది. అదేసమయంలో కాదు, అసలు టీడీపీనే వికృత రాజకీయాలకు తెరదీసిందని వైసీపీ ఆరోపించుకుంటు న్నాయి. దీనికి కారణం సోషల్ మీడియా. నిజానికి ఇప్పటి వరకు సోషల్ మీడియా వేదికలపైనా..ఈ రెండు పార్టీలూ విమర్శించుకుంటున్నాయి.
కానీ, ఇప్పుడు ఈ వార్తల రంగురుచివాసన మారిపోయాయనేది టీడీపీ నేతలు చెబుతున్న మాట. వైసీపీ తన సోషల్ మీడియాలో టీడీపీనేతల పని అయిపోయిందని.. ఈ నేత పరిస్థితి ఇలా ఉందని.. చంద్రబా బుకు ఆరోగ్యం బాగోలేదని.. ఎక్కువ సేపు ఆయన రాజకీయాలు చేయలేకపోతున్నారని.. ప్రజలు నమ్మేలా వార్తలు ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్టు టీడీపీకి సమాచారం అందింది. దీంతో వైసీపీని గట్టిగా నిలువరించి.. ఈ ఫేక్ న్యూస్‌ను కట్టిపెట్టాలని..చంద్రబాబు పిలుపునిచ్చారు.
అదేసమయంలో టీడీపీ కూడా.. వైసీపీ ప్రభుత్వంపై నకిలీ వార్తలు ప్రచారం చేస్తోందని.. చేసేందుకు ఏర్పాట్లు చేసిందని.. వైసీపీ నాయకులు అంటున్నారు. సంక్షేమం అందినా.. అందనట్టుగా ప్రచారం చేయడం.. ఎక్కడో మారుమూల పల్లెల్లో ఉన్న పాడైన పాఠశాలలను చూపించి.. వ్యతిరేక ప్రచారం చేయడం ద్వారాప్రజల్లో సీఎం జగన్‌కు ఉన్న సానుభూతిని పోగొట్టే ప్రయత్నం చేస్తోందని వైసీపీ నాయకులు అంటున్నారు.
మొత్తంగా..ఈ రెండు పార్టీల రాజకీయం ఇప్పుడు 'ఫేక్' న్యూస్ చుట్టూ తిరుగుతుండడం గమనార్హం. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో మరెన్ని విమర్శలు చూడాలో.. వినాలో.. అంటున్నారు పరిశీలకులు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.