Begin typing your search above and press return to search.
అమెజాన్‌లో ఫేక్ రివ్యూలు... ఇదో పెద్దస్కామ్..!
By: Tupaki Desk | 18 Feb 2021 1:30 AM GMTఇప్పుడంతా డిజిటల్ యుగం. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోకి కావాల్సిన వస్తువులు, బట్టలు, మొబైల్స్ ఇలా అన్నీ ఆన్లైన్లోనే కొంటున్నారు. అయితే మనం ఏదైనా వస్తువును కొంటున్నామంటే కచ్చితంగా రివ్యూలు, రేటింగ్ చూసి కొనుగోలు చేస్తాం. అయితే అమెజాన్‌లో ఫేక్రివ్యూలు వస్తున్నట్టు విచ్ (Which?) అనే ఓ సంస్థ గుర్తించింది. ఇలా ఫేక్ రివ్యూలు ఇవ్వడం ఓ పెద్ద స్కామ్ అని ఈ సంస్థ ఆధారాలతో సహా వెల్లడించింది. పలు కంపెనీలు తమ ఉత్పత్తులను భారీగా విక్రయించుకొనేందుకు ఇలా ఫేక్ రివ్యూలను ఇప్పించుకుంటున్నారని సదరు సంస్థ ఆరోపించింది. ఇలా ఫేక్రివ్యూలు ఇచ్చేందుకు ప్రత్యేకంగా కొన్ని కంపెనీలు పనిచేస్తున్నాయని విచ్ సంస్థ వెల్లడించింది.
డబ్బులు తీసుకొని కొందరు ఫేక్ రివ్యూలు ఇస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం ఓ పెద్ద టీమ్ పనిచేస్తున్నట్టు టాక్. చాలామంది ఒక ఫేక్ రివ్యూ ఇచ్చేందుకు దాదాపు రూ. 500 (5పౌండ్లు) తీసుకుంటున్నట్టు సమాచారం.
ఈ ఫేక్ రివ్యూలపై అమెజాన్‌కు కూడా సమాచారం ఉంది. కొందరు కావాలనే తమ ఉత్పత్తులను అమ్ముకొనేందుకు ఇలా చేస్తున్నారు. దీనిపై అమెజాన్ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ.. ‘నకిలీ రివ్యూలు మా దృష్టికి వేస్తే వెంటనే మేము వాటిని తొలగిస్తాం. ఇటువంటి రివ్యూలు ఇచ్చేవాళ్లపై కచ్చితంగా చర్యలు తీసుకుంటాం’ అని అన్నారు.
ఇలా చేయడం అమెజాన్ నిబంధనలను ఉల్లంఘించడమే.
చాలా ఫేస్బుక్ గ్రూప్‌లు ఇటువంటి ఫేక్ రివ్యూలు ఇస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం సదరు కంపెనీ నుంచి భారీ మొత్తంలో డబ్బులు కూడా సంపాదిస్తున్నట్టు సమాచారం. తమ ఉత్పత్తులు విపరీతంగా అమ్ముడు పోతుండటంతో కొన్ని కంపెనీలు వీళ్లను ఆశ్రయిస్తున్నారు.
ఏదీ ఫేక్ ? ఏది రియల్?
అమెజాన్ లాంటి సంస్థల్లో ఎవరైనా వస్తువులు కొనుగోలు చేయాలంటే కచ్చితంగా రివ్యూలు చూసే కొంటారు. అయితే ఇందులో ఫేక్ ఏదో రియల్ ఏదో తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్రాండెడ్ వస్తువు కాకపోయినా.. ఏదైనా వస్తువుకు విపరీతంగా పాజిటివ్ రివ్యూలు ఉంటే అది ఫేక్ రివ్యూ అని గ్రహించాలని సూచిస్తున్నారు. ఐదారు, పది రివ్యూలు ఒకే రకంగా ఉన్నా అవి ఫేక్ రివ్యూ అని తెలుసుకొవాలని అంటున్నారు.