Begin typing your search above and press return to search.
కొత్త మోసం:అమెరికాకు బిల్ గేట్స్... చైనా కు జాక్ మా... ఇండియాకు నేను
By: Tupaki Desk | 25 Dec 2018 7:37 AM GMTఇదో కొత్త తరహా మోసం. అలాంటి ఇలాంటి మోసం కాదు. అమెరికాకు బిల్‌గేట్స్ ఉన్నాడు... జపాన్ కు తడాషి యానాయి.... చైనాకు జాక్ మా... వీరంతా ఆయా దేశాల్లో శ్రీమంతులు... వారిలాగా తాను కూడా ఇండియాలో శ్రీమంతుడిగా ప్రచారం చేసుకున్నాడు. అతనే ఐద్వెత ప్రక్రియ గిరీశ్. ఇంటర్ ఫెయిల్ అయిన ఈ గిరీశ్... ఇప్పుడు తాను ఇండియాలో అత్యంత శ్రీమంతుడిగా పోల్చుకున్నాడు. ప్రపంచ శ్రీమంతుల ఫొటోలతో ప్రచారం చేసుకున్నాడు... ఇది నిజమేనని దాదాపు వెయ్యిమంది అతని వద్ద రూ.60 కోట్లను పెట్టుబడిపెట్టి లాభాల కోసం ఎదురుచూస్తున్నారు.. ఈ లోపే అతని భాగోతం బయటపడింది. రాచకొండ సైబర్ క్రైం పోలీసులు సోమవారం గిరీశ్‌సింగ్ అనే ఆధ్యాత్మిక గురువు అరెస్ట్ తో గొలుసుకట్టు భాగోతం బయటపడడంతో అనేక ఆసక్తికరమైన కోణాలు బయటపడ్డాయి.
గిరీశ్ సింగ్... తన మాటలతో ఎవరినైనా ఆకట్టుకోగలడు. దీంతో అతనికి చాలామంది భక్తులుగా మారారు. అతని ప్రవచనాలకు ప్రభావితమై.. అతను చెప్పినట్లు చేసేవారు. నాలో ఉన్న శక్తి, దేవి ఆశీర్వాదంతో తాను కచ్చితంగా 2024లో ప్రధాన మంత్రిని అవుతానని ప్రచారం చేసుకున్నాడు. నేను నిత్యం నా మైండ్‌లో అనుకుంటాను... కాబట్టి ప్రధాన మంత్రి అయ్యి తీరుతానని చెప్పేవాడు. అతని మాటల మాయలో భక్తులు పడేవారు. గిరీశ్‌సింగ్ ఆంగ్లం, తెలుగు, హిందీ భాషల్లో స్పష్టంగా మాట్లాడి అందర్నీ నమ్మించేవాడు.
ఆంధ్రప్రదేశ్- నెల్లూరు జిల్లా- సూల్లూరిపేట ప్రాంతానికి చెందిన గిరీశ్ సింగ్ ఇంటర్మీడియట్ వరకు చదివాడు. తల్లి చనిపోవడంతో అమ్మమ్మ వద్ద పెరిగి.. స్థానికంగా ఉన్న బాలాత్రిపుర సుందరీ దేవి ఆలయంలో ఉంటూ భక్తి భావాన్ని పెంచుకున్నాడు. ఆ తర్వాత కొన్ని పురాణాలు, మహిమల కథల పుస్తకాలు, పాజిటీవ్ నెస్‌ను పెంచే ప్రవచనాలు, ప్రముఖుల సూచనల పుస్తకాలను చదివి. కొంత ఆధ్యాత్మిక పరిజ్ఞాణాన్ని పొందాడు. అలా.. తన మాటలకు బాలత్రిపుర సుందరీ దేవి ఆశీర్వాదం ఉందని .. తాను ఏది చెబితే అది నిజం అవుతుందని నమ్మించి ప్రచారం చేసుకున్నాడు. అతని తండ్రి మరో వివాహం చేసుకోవడంతో గిరీశ్ సింగ్ తన మకాన్ని 2012లో హైదరాబాద్ మాదాపూర్ ప్రాంతానికి మార్చి ఐద్వెత స్పిరిచ్యూవెల్ రీచార్జ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ సంస్థను ఏర్పాటు చేశారు. అలా స్వల్ప కాలంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక గురువుగా పేరొందాడు.
తన ప్రవచనాలతో ఆకుట్టుకున్న గిరీశ్ సింగ్.. మెల్లిగా భక్తులకు ఆర్థిక లాభాలంటూ గాలం వేశాడు. దీని కోసం అమీర్ పేట్ లో డ్రీమ్ బ్రిడ్స్ పేరుతో ఓ కార్యాలయాన్ని తెరిచాడు. దాని ద్వారా డ్రీమ్ బ్రిడ్స్ సోషల్ ట్రేడ్ పేరుతో గొలుసుకట్టు దందాను ప్రారంభించాడు. దీంట్లో చేరే సభ్యులకు ఓ యూజర్ ఐడీని ఇస్తారు. ఆ ఐడీలో వచ్చే ప్రకటనలకు ప్రతి రోజు క్లిక్ చేస్తే చాలని చెబుతాడు. అలా యూజర్ ఐడీని పొందినవారు మరో ఇద్దర్నీ తప్పనిసరిగా చేర్పించాలనే నిబంధన ఉంటుంది. ఇలా... మొదట చేరినవారు సభ్యులను చేర్చుకుంటూ పోతే వారికి స్థాయిలు పెరుగుతాయి. దీని కోసం ఈ గొలుసుకట్టులో చేరేవారు. రూ.1,116 నుంచి 60 వేలు లేదా లక్ష రూపాయల వరకు డిపాజిట్ చేసి యూజర్ ఐడీని పొందవచ్చు. లక్ష రూపాయలు కట్టిన వారికి 6 నెలల్లో కోట్లాది రూపాయలు వస్తాయని నమ్మించాడు. ఈ ఆదాయం నిజంగానే వస్తుందని నమ్మిన నాగోల్‌కు చెందిన భక్తురాలు స్వప్న దాదాపు రూ.21 లక్షలను కట్టింది. చివరకు మోసపోయానని గ్రహించి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. ఈ ఫిర్యాదుతో తీగలాగితే డొంక కదిలింది.
గిరీశ్ సింగ్.. భక్తులకు ఐద్వెత ప్రక్రియ సిద్ధాంతాన్ని ప్రబోధించేవాడు. ఐద్వెత ప్రక్రియ అంటే...ప్రతి మనిషిలో తెలియని శక్తి ఉంటుంది. ఆ శక్తిని నమ్ముకుని మనస్సా, వాచ, ఆత్మసాక్షిగా నిత్యం తలచుకుంటూ, ఊహించుకుంటే ప్రపంచంలో ఏదైనా సాధించిపెడుతుందని బోధించే వాడు. దీనికి మంచి ఆలోచనలు, ఆకాంక్ష కలిగి ఉండాలని చెప్పేవాడు. ఈ మాటలతో భక్తులను మాయలో పడేశాడు. అంతేకాకుండా ఈ ప్రక్రియల బోధనలకు ప్రత్యేక ధరలను ఫిక్స్ చేశాడు. రూ. 75 వేల నుంచి రూ.2 లక్షల వరకు ప్రతి సెషన్‌కు వసూలు చేశాడు.
ఇలా గిరీశ్ సింగ్... సభ్యుల నుంచి వసూలు చేసిన డబ్బుతో దాదా పు 20 దేశాలు తిరిగి జల్సా చేశాడని తెలిసింది. మలేషియా- సింగపూర్- దుబాయ్ దేశాల్లో కార్యాలయాలను తెరిచి వ్యాపారాన్ని విస్తృతం చేస్తున్నట్లు ప్రచారం చేసుకున్నాడు. గిరీశ్ ఫిలిం కంపెనీ- గిరీశ్ ఎయిర్‌లైన్స్- పేటీఎం లాగా సరికొత్త పేమెంట్ వాలెట్‌లు- బ్యాంకులు- సోషల్ ట్రేడింగ్ వ్యాపారాలు- గిరీశ్ ఏషియన్ ఫుడ్‌కోర్టు- బిట్‌కాయిన్ లాగా గిరీశ్ కాయిన్ లు- బంగారం- వజ్రాల వ్యాపారాలు ప్రారంభిస్తున్నట్లు చెప్పి మొత్తం 30 కంపెనీలను రిజిస్టర్ చేసుకున్నాడు. ఖరీదైన కార్లలో తిరిగేవాడు.
ఆ తర్వాత హిమాలయన్ యూనివర్సిటీ నుంచి నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ పొందాడు. తన వద్ద పనిచేసే యువతిని ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో వివాహం చేసుకున్నాడు. ఈ వివాహ వేడుకను శివారులోని ఓ ఫిలింసిటీ లో అంగరంగ వైభవంగా జరుపుకున్నాడు. దీని కోసం రూ.3 కోట్లకు వరకు ఖర్చుపెట్టాడని పోలీస్ దర్యాప్తులో తేలింది.