Begin typing your search above and press return to search.

నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్ సేఫ్ గా వచ్చేసింది

By:  Tupaki Desk   |   23 Dec 2015 5:02 AM GMT
నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్ సేఫ్ గా వచ్చేసింది
X
అంతరిక్ష ప్రయోగాల సందర్భంగా రాకెట్ ప్రయోగాలు మామూలే. ఈ సందర్భంగా రాకెట్ ను నింగిలోకి పంపటం.. ఆ తర్వాత అది కనిపించకుండా ఉండిపోవటం.. అంతరిక్షంలో అలానే ఉండిపోవటం మామూలే. కానీ.. అందుకు భిన్నమైన విధానాన్ని అనుసరించి సక్సెస్ అయ్యారు.

నింగిలోకి ప్రయోగించిన రాకెట్ ను తిరిగి నేల మీదకు సేఫ్ గా తిరిగి తీసుకొచ్చింది లేదు. అలాంటి అరుదైన ఫీట్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశారు. ఫాల్కన్ 9 రాకెట్ ను అమెరికా ఫ్లోరిడాలోనికేప్ కెనవెరాల్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించారు. విమానం మాదిరి తిరిగి దాన్ని భూమి మీదకు తీసుకొచ్చారు. సోమవారం రాత్రి అంతరిక్షం నుంచి భూమి మీదకు సేఫ్ గా ల్యాండ్ అయిన ఈ రాకెట్ సరికొత్త రికార్డు సృష్టించింది. నింగిలోకి తనతో తీసుకెళ్లిన ఉప గ్రహాలను.. కక్షలోకి ప్రవేశ పెట్టిన తర్వాత మళ్లీ నేల మీదకు రాకెట్ తిరిగి వచ్చేసింది.