Begin typing your search above and press return to search.
ట్రంప్ కంటే ఘోరం.. జోబైడెన్ పరపతి దారుణం
By: Tupaki Desk | 20 July 2022 6:30 AM GMTఅమెరికా అధ్యక్ష చరిత్రలోనే అత్యంత చెత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఖ్యాతినెక్కాడు. జాత్యహంకారం.. కీర్తి కండూతి, చిత్త చాపల్యం, విలాసాలు, వినోదాలు, పాలనా వైఫల్యాలు, ఆర్థిక మందగమనం నడుమ అమెరికా పూర్వ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఇంటా బయటా చాలా చెడ్డ పేరు వచ్చింది. మొన్నటి ఎన్నికల్లో ప్రజలు ఆయనను గద్దె దింపి.. అనుభవజ్ఞుడు, సాత్వికుడు అయిన జోబైడెన్ కు పట్టం కట్టారు.
జోబైడెన్ అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తయ్యింది. ఇంతవరకూ ఆయన చేసిన అద్భుతాలు ఏమీ లేకపోగా.. ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం మొదలైన అంశాలపై ప్రజల్లో భయం పట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో జోబైడెన్ పరపతి, ప్రాచుర్యం తగ్గుముఖం పట్టినట్టుగా నివేదికలు చెబుతున్నాయి.
దేశవ్యాప్తంగా ప్రజామోదంలో జోబైడెన్ రేటింగ్ గణనీయంగా పడిపోయింది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు గతంలో వచ్చిన రేటింగ్ కంటే కూడా కిందకు వెళ్లిపోయింది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు గతంలో వచ్చిన రేటింగ్ కంటే కూడా కిందకు వెళ్లిపోయింది. జోబైడెన్ ప్రజామోద రేటింగ్ 36 శాతానికి దిగివచ్చింది.
అమెరికా పాలకులలోనే అతి దారుణంగా 37 శఆతం రేటింగ్ పొంది ట్రంప్ నాడు వార్తల్లోకి ఎక్కారు. ట్రంప్ కంటే కూడా దిగిపోయి ఇప్పుడు జోబైడెన్ మరింతగా ప్రతిష్టను మసకబార్చుకున్నాడు. సీఎన్ బీసీ తాజాగా నిర్వహించిన 'ఆల్ అమెరికా' సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
ధరలు మరింతగా పెరుగుతాయని.. మరోమారు ఆర్థిక మాంద్యంలోకి వెళ్లిపోతామేమో అనే భయం అమెరికన్లకు పట్టుకున్నట్టు సర్వేలో తేలింది. అందుకే ఆర్థిక నిర్వహణలో జోబైడెన్ ఆమోద రేటింగ్ ఘోరంగా 30శాతానికి పడిపోయింది. ఇదే అంశంలో గతంలో డొనాల్డ్ ట్రంప్ నకు 41 శాతం వచ్చింది. 2008లో ఆర్థిక మాంద్యం వచ్చింది. అప్పుడు అధ్యక్షుడిగా ఉన్న బరాక్ ఒబామా 37 శాతం రేటింగ్ సాధించాడు. దానిని పరమ చెత్త రేటింగ్ గా అమెరికన్లు అభివర్ణించారు.
ఇప్పుడు జోబైడెన్ వీరిద్దరి కంటే కూడా తక్కువ రేటింగ్ తెచ్చుకొని చర్చనీయాంశంగా మారాడు. దీన్ని బట్టి జోబైడెన్ ప్రతిష్ట మసకబారుతోంది. సొంత డెమొక్రటిక్ పార్టీలోనూ బైడెన్ ఆదరణ తగ్గిపోతోందని కథనాలు వస్తున్నాయి.