Begin typing your search above and press return to search.

వేగంగా పడిపోతున్న స్పెర్మ్ కౌంట్.. ఈ లిస్టులో భారత్ కూడా ఉందా..!

By:  Tupaki Desk   |   17 Nov 2022 11:30 AM GMT
వేగంగా పడిపోతున్న స్పెర్మ్ కౌంట్.. ఈ లిస్టులో భారత్ కూడా ఉందా..!
X
ప్రపంచవ్యాప్తంగా మగవారిలో స్పెర్మ్ కౌంట్ భారీగా తగ్గిపోతుందని.. దీని వల్ల రాబోయే రోజుల్లో మానవ మనుగడకు పెను ముప్పు తప్పదని అంతర్జాతీయ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. గత 46 ఏళ్లలో స్పెర్మ్ కౌంట్ యాభై శాతం మేరకు పడిపోయిందని ఇజ్రాయెల్‌లో జెరూసలేంలోని హిబ్రూ యూనివర్శిటీ శాస్త్రవేత్తల బృందం చేపట్టిన అధ్యయనంలో వెల్లడి కావడం ఆందోళనకు గురిచేస్తోంది.

53 దేశాలకు చెందిన పురుషుల నుంచి సేకరించిన స్పెర్మ్ కౌంట్ వివరాలను ‘హ్యూమన్‌ రీప్రొడక్షన్‌ అప్‌డేట్‌’ తన జర్నల్‌లో ప్రచురించింది. 2011 నుంచి 2018 మధ్య కాలంలో 53 దేశాలకు చెందిన పురుషుల నుంచి సైంటిస్టులు స్పెర్మ్‌ను సేకరించారు. ఆయా ప్రాంతాల వారీగా మగవారిలో వీర్యకణాలు ఏమేరకు తగ్గుదల ఉందనే విషయంపై అధ్యయనం చేశారు.

అయితే ఆసియా.. ఆఫ్రికా.. దక్షిణ అమెరికా ప్రాంతాలకు చెందిన మగవారిలో వీర్యకణాల సంఖ్య భారీగా తగ్గుదల కనిపించినట్లు గుర్తించారు. ఇక భారత్‌లోనూ ఈ పరిస్థితి ఉందని సైంటిస్టులు పేర్కొన్నారు. మగవారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గితే దీర్ఘకాలిక వ్యాధులు.. టెస్టిస్ క్యానర్స్ వంటి ప్రమాదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.

1973 నుంచి 2018 వరకు ఉన్న డేటా ప్రకారంగా స్పెర్మ్ కౌంట్ ఏడాదికి సగటున 1.2 శాతం మేర తగ్గింది. 2000 సంవత్సరం తర్వాత ఏడాదికి 2.6శాతం కంటే మేరకు కౌంట్ తగ్గిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. వాతావరణంలో వస్తున్న మార్పులు.. మారుతున్న జీవనశైలి కూడా మగవారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి కారణమవుతుందని సైంటిస్టులు పేర్కొంటున్నారు.

మగవారిలో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గితే రాబోయే రోజుల్లో మానవ మనుగడపై ప్రభావం ఉంటుందని పరిశోధకులు ఆందోళన చెందుతున్నారు. దీని నివారించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యకరమైన వాతావరణ పరిస్థితులు.. వాతావరణంలో హానికారకాలు తగ్గించేందుకు తగిన కార్యాచరణను అమలు చేయాల్సిన ఎంతైనా ఉందని పరిశోధకులు సూచిస్తున్నారు.

మగవాళ్లు స్పెర్మ్ కౌంట్ పెంచుకునేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని.. ఆహార అలవాట్లలో మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు. స్మోకింగ్.. ఆల్కహాల్ వంటి అలవాట్లకు దూరంగా ఉంటే దెబ్బతిన్న డీఎన్ఏ తిరిగి మామూలు స్థాయికి చేరుకుంటుందని చెబుతున్నారు. దీని వల్ల లైఫ్ స్పాన్ పెరగడంతోపాటు స్పెర్మ్ కౌంట్ కూడా పెరుగుతుందని సైంటిస్టులు సూచిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.