Begin typing your search above and press return to search.

పోర్ బంద‌ర్ నేవ‌ల్ బేస్ లో ఏం జ‌రిగింది?

By:  Tupaki Desk   |   7 Oct 2016 10:12 AM GMT
పోర్ బంద‌ర్ నేవ‌ల్ బేస్ లో ఏం జ‌రిగింది?
X
గుజ‌రాత్‌ లోని పోర్ బంద‌ర్‌ నేవ‌ల్‌ బేస్ లో ఏం జ‌రిగింద‌న్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. ఉరీ ఉగ్ర‌దాడి.. అనంత‌రం పాక్ అక్ర‌మిత క‌శ్మీర్ పై భార‌త సైన్యం జ‌రిపిన స‌ర్జిక‌ల్ దాడుల నేప‌థ్యంలో భార‌త్ - పాక్ దేశాల మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త వాతావ‌ర‌ణం చోటు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. స‌ర్జిక‌ల్ దాడుల త‌ర్వాత నుంచి త‌ర‌చూ స‌రిహ‌ద్దుల్లో కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేప‌థ్యంలో గుజ‌రాత్ లోని పోర్ బంద‌ర్ నేవ‌ల్ బేస్ స‌మీపంలో పేలుడు సంభ‌వించింది. ఇది ఉగ్ర‌వాదుల చ‌ర్య‌గా పుకార్లు షికార్లు చేశాయి.

దీంతో స్పందించిన భ‌ద్ర‌తా ద‌ళాలు విస్తృత గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. అయితే.. పేలింది బాంబు కాద‌ని.. దీపావ‌ళి ట‌పాసులుగా అధికారులు గుర్తించారు. మ‌రోవైపు కాల్పుల శ‌బ్దం విన్న‌ట్లుగా కొంద‌రు స‌మాచారం అందించ‌టంతో ఏం జ‌రుగుతుందోన‌న్న ఆందోళ‌న వ్య‌క్త‌మైంది. నేవ‌ల్ సిబ్బంది నివాసం ఉండే నివాస గృహాల స‌ముదాయానికి స‌మీపంలో కాల్పుల మోత వినిపించ‌టంతో భ‌ద్ర‌తా ద‌ళాలు అప్ర‌మ‌త్త‌మై.. పేలుడు శ‌బ్దాన్ని త‌ప్పుగా అర్థం చేసుకున్న‌ట్లుగా గుర్తించారు.

అయితే.. పాకిస్థాన్ నుంచి ఏ క్ష‌ణంలో అయినా దాడులు జ‌రిగే అవ‌కాశం ఉంద‌న్న నిఘా వ‌ర్గాల హెచ్చ‌రిక‌తో వెస్టుకోస్టు మొత్తం అప్ర‌మ‌త్త‌మైంది. కొద్దిరోజుల కింద‌ట పాక్ కు చెందిన ప‌డ‌వ‌ను భ‌ద్ర‌తా ద‌ళాలు అదుపులోకి తీసుకున్న ఉదంతం నేప‌థ్యంలో పోర్ బంద‌ర్ తో పాటు.. గుజ‌రాత్ - రాజ‌స్థాన్‌ - పంజాబ్‌ - జ‌మ్ముక‌శ్మీర్ ల‌లో హైఅలెర్ట్ ప్ర‌క‌టించారు. దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపిన ఈ కాల్పుల ఘ‌ట‌నలో అనుకోని ప్ర‌మాదం ఏమీ చోటు చేసుకోలేద‌ని తేల‌టంతో అంద‌రూ హాయిగా ఊపిరి పీల్చుకునే ప‌రిస్థితి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/