Begin typing your search above and press return to search.
ఇకపై తప్పుడు ప్రచారాలకు స్వస్తి పలకాల్సిందే ... ఏపీ ఫ్యాక్ట్ చెక్ వెబ్‌సైట్ ప్రారంభించిన సీఎం !
By: Tupaki Desk | 5 March 2021 10:40 AM GMTఈ మధ్య కాలంలో సోషల్ మీడియా లో ఎక్కువగా ఫేక్ న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. అసలు ఎంతలా ఫేక్ న్యూస్ వైరల్ అవుతుంది అంటే ఆ ఫేక్ న్యూసే నిజం అని నమ్మేలా సర్క్యులేట్ చేస్తున్నారు. దీని వల్ల అనేక సమస్యలు ఉత్పన్నం అవుతుండటంతో దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలను అడ్డుకునేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. వాస్తవాలను కప్పిపుచ్చి, అసత్య ప్రచారాలు చేస్తే ఇకపై చెల్లదని సీఎం జగన్ హెచ్చరించారు.
దురుద్దేశ పూర్వకంగా చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తూ ఏపీ ప్రభుత్వం తరఫున 'ఏపీ ఫ్యాక్ట్ చెక్' వేదికను ఏర్పాటు చేశారు. క్యాంపు కార్యాలయంలో ఏపీ ఫ్యాక్ట్ చెక్ వెబ్ సైట్, ట్విట్టర్ అకౌంట్‌ను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. మీడియా, సోషల్ మీడియాలో దురుద్దేశ పూర్వక ప్రచారం చేస్తున్నారని, ఈ తప్పుడు ప్రచారాన్ని ఆధారాలతో ఏపీ ఫ్యాక్ట్ చెక్ వేదికగా ప్రభుత్వం ఖండిస్తుందన్నారు.
నిజమేంటో, అబద్ధం ఏంటో చూపిస్తారని..దురుద్దేశపూర్వక ప్రచారంపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యక్తులు, వ్యవస్థల ప్రతిష్టను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసే హక్కు ఏ ఒక్కరికీ లేదని, ప్రజలను తప్పు దోవపట్టించే పనులు ఎవరూ చేయకూడదన్నారు. ప్రభుత్వం ప్రతిష్ట్మాతకంగా చేపడుతున్న కార్యక్రమాలపైన వ్యవస్థలను, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రచారాలు చేస్తున్నారని, అసలు నిజమేంటో, నడుతస్తున్న అబద్ధపు ప్రచారం ఏంటో చూపిస్తారని తెలిపారు. ఏపీ ఫ్యాక్ట్‌చెక్ ముఖ్య ఉద్దేశం ఇదేనన్నారు. ఇలాంటి వాటికి ఎక్కడోచోట ముగింపు పలకాలని సీఎం వైఎస్ జగన్ అన్నారు. వెబ్ సైట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీస్ సహా పలువురు అధికారులు హాజరయ్యారు.