Begin typing your search above and press return to search.
చైనా ఎంత డేంజరో చెప్పిన రోజుది
By: Tupaki Desk | 20 July 2019 12:16 PM GMTభారత్ ప్రజాస్వామ్య దేశం.. ఇక్కడ ప్రజలే పాలకులు. అణిచివేతలు.. నిర్భంధాలు, ఎమర్జెన్సీలు చాలా తక్కువ. కానీ చైనా అలా కాదు.. అక్కడ కొలువైంది కమ్యూనిస్టు ప్రభుత్వం. వీరికి దేవుడు, దయ , ప్రజాస్వామ్యం అనేది ఉండదు. తమకు ఎదురు తిరిగినా.. ప్రజల్లో తిరుగుబాటు చెలరేగినా.. ప్రజావ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినా వారిని నిర్ధాక్షిణ్యంగా అరెస్ట్ చేసి లోపలేస్తారు. కమ్యూనిస్టుల పాలనకు, ప్రజాస్వామ్య పాలనకు చాలా తేడా ఉంటుంది.. అక్కడ అన్ని నిర్భంధ చట్టాలే..
*చైనా దురాక్రమం బయటపడింది ఇలా.?
చైనా చరిత్రలోనే జూలై 20 ఒకటి చీకటి రోజు.. చైనా సాగించిన అక్రమాల వ్యవహారం 1999 జూలై 20న బద్దలైంది. ఈ రోజు వందలాది మంది ఫాలున్ గాంగ్ సభ్యులను ఊచకోత కోసి వారి అవయవాలను అమ్ముకున్న చైనా ప్రభుత్వం దమనకాండ వెలుగుచూసి ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. దీనిపై అన్ని దేశాలు చైనాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
*ఫాలున్ గాంగ్ లు అంటే ఎవరు?
భారత దేశంలోని యోగా ఆచరించే గురువుల వలే చైనా ‘ఫాలున్ గాంగ్ లేదా ఫాలున్ దఫా’ అనే ఉద్యమం ప్రారంభమైంది. నృత్యం, యోగా మొదలైనవి సాధన చేస్తూ శాంతియుత జీవనాన్ని సాగించే ఒక వర్గం బౌద్దుల సమూహాన్నే ‘ఫాలున్ గాంగ్’ అంటారు. ఈ గాంగ్ ను 1992లో లీహోంగ్జీ అనే వ్యక్తి శాంతియుత జీవనం కోసం శ్రీకారం చుట్టారు. కొద్దికాలంలోనే అందులో 7కోట్ల మంది చేరారు. ఇదొక ఆధ్యాత్మిక ఉద్యమంలా చైనాలో ఉదృతంగా సాగింది. జనం ఆరోగ్యంగా ఉండాలంటే దీన్ని పాటించాలని అందరూ ఫాలో అయ్యారు..
*కమ్యూనిస్టు చైనా కన్నెర్ర
ఈ ఫాలున్ గాంగ్ లు 7 కోట్ల మందికిపైగా సభ్యులుగా చేరి కమ్యూనిస్టు ప్రభుత్వానికే ముప్పుగా మారుతారని భావించిన నాటి చైనా ప్రభుత్వం వీరిపై నిషేధం విధించింది. 1999లో 10వేల మంది సభ్యులు ఆందోళన నిర్వహిస్తే వీరిని అరెస్ట్ చేసి జైల్లో వేసింది. వీరిపై దమనకాండకు దిగింది. ఫాలున్ గాంగ్ సభ్యుల అవయవాలను తొలగించి దేశంలో, ఇతర దేశాలకు అమ్ముకుంది. జైల్లలో మగ్గిన ఫాలున్ గాంగ్ సభ్యులను బతికుండగానే అవయావాలు లాగేసిన వ్యవహారం తర్వాత ప్రపంచానికి తెలిసి అందరూ షాక్ అయ్యారు.
*అవయవాల కోసం వీరినే చంపేశారు..
చైనా ఈ అక్రమాలు బయటపడకుండా మీడియాను, జైల్లలో అధికారులను నియంత్రించారు. 2006వరకు ఫాలున్ గాంగ్ సభ్యులను ఇలానే చంపేసి అవయవాలు అమ్ముకున్నారు. 2006లో ఈ విషయం తెలిసి ప్రపంచమే నివ్వెరపోయింది. ఈ కారణంగానే అప్పట్లో చైనా అవయవ మార్పిడికి అనువైన దేశంలా మారిపోయింది. జపాన్, ఇజ్రయిల్, ఇతర దేశాల నుంచి అవయవాల కోసం పెద్ద ఎత్తున రోగులు రాగా.. వారందరికీ ఫాలున్ గాంగ్ సభ్యులను చంపి వారి అవయవాలు తొడిగేసివారు.. ప్రతీరోజు 160మంది ఖైదీలను అవయవాల కోసం హతమార్చినట్టు ఆరోపణలున్నాయి. ఏటా లక్ష వరకు అవయవ మార్పిడిలు చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ విషయం బయటకు వచ్చాక తీవ్ర కలకలం రేగింది. చైనా చర్యలను ప్రపంచం ఖండించింది.
*చైనా దురాగతానికి 20 ఏళ్లు
చైనా సాగించి దారుణ మారణహోమం జూలై 20వ తేదీ సందర్భంగా మరోసారి ప్రపంచం గుర్తు చేసుకుంటోంది. ఇదేరోజు 1999లో బయటపడ్డ విషయం ఇప్పుడు చైనా దురగాతాలను కళ్లకు కడుతోంది.