Begin typing your search above and press return to search.
ఆ ప్రశ్నకు రాజ్ నాథ్ కు నోట మాట రాలేదు
By: Tupaki Desk | 23 Dec 2015 9:46 AM GMTఊహించని పరిణామం ఎదురైన నేపథ్యంలో కేంద్ర హోంశాఖా మంత్రి రాజ్ నాథ్ నోటి వెంట మాట రాని పరిస్థితి. కంచుకంఠంతో మాట్లాడే ఆయన.. జవాబు చెప్పలేక మౌనంగా ఉండిపోయారు. ప్రభుత్వ వైఫల్యాల్ని సూటిగా ప్రశ్నించిన ఒక మహిళ కారణంగా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో బీఎస్ ఎఫ్ కు చెందిన విమానం ఒకటి కూలిపోయిన ఘటనలో ముగ్గురు బీఎస్ ఎఫ్ అధికారులతో సహా పది మంది దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. మరణించిన వారి అంత్యక్రియలకు నివాళులు అర్పించేందుకు రాజ్ నాథ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఒక జవాను సతీమణి ఆవేశంగా అడిగిన ప్రశ్నలకు రాజ్ నాథ్ నోట మాట రాని పరిస్థితి. వీఐపీల విమానాల్లో జరగని ప్రమాదాలు సైనికుల విమానాలకే ఎందుకు జరుగుతుంటాయని నిలదీసిన ఆమె.. మా కుటుంబాలే ఎప్పుడూ ఏడుస్తూ ఉండాలా? అంటూ సూటిగా ప్రశ్నించారు. తాజాగా కూలిపోయిన విమానం చాలా పాతదని.. దాన్ని మార్చాలని తన భర్త ఎంతోకాలంగా అడుగుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తాను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు.
ఇంతలో అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది కలుగజేసుకొని ఆమెను పక్కకు తీసుకెళ్లారు. గంభీరంగా ఉన్న రాజ్ నాథ్ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. అనంతరం బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ.. చాలా పాత విమానాలు వినియోగిస్తున్నామని.. కొత్తవి ఇవ్వాలని తాము కోరినా పట్టించుకోవటం లేదంటూ తన భర్త తనతో పలుమార్లు చెప్పినట్లుగా ఆమె వ్యాఖ్యానించారు. జవాన్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసే ఇలాంటి వ్యవహారాల మీద మోడీ సర్కారు మరింత ఫోకస్ చేయాల్సి ఉంది.