Begin typing your search above and press return to search.
అవును.. ఈ కోర్టులో పెద్దోళ్ల కోసం పార్కు.. పిల్లల కోసం ప్లే జోన్
By: Tupaki Desk | 30 Dec 2021 5:30 PM GMTకోర్టు అన్నంతనే.. పాత కాలపు భవనం.. విశాలమైన ప్లేస్ లో.. గుబురుగాపెరిగిన చెట్లు.. అలానా పాలనా లేకుండా ఉన్నట్లుగా దర్శనమిస్తాయి న్యాయస్థానాలు. ప్రజల కష్టాలకు స్పందించటం.. వివిధ వ్యవస్థలను పరుగులు పెట్టించే కోర్టులు.. తమ విషయంలో మాత్రం తాము ఏమీ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాయన్నట్లుగా ఉంటాయి కొన్ని కోర్టు. ఈ మధ్యనే ఒక ప్రముఖ మీడియా సంస్థకు చెందిన దినపత్రికల్లో తెలంగాణ రాష్ట్రంలోని కోర్టు భవనాలు ఎంత దారుణంగా ఉన్నాయన్న విషయాన్ని తెలియజేయటమే కాదు.. మౌలిక వసతుల విషయంలోనూ అరకొర అన్నట్లుగా ఉన్న విషయాలు వెలుగు చూశాయి.
అందరి సమస్యల్ని తీర్చే న్యాయస్థానాలు.. తాము ఎదుర్కొనే సమస్యల గురించి చాలా అరుదుగా మాత్రమే హైకోర్టు.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లు పెదవి విప్పుతుంటారు. అయితే.. ఇప్పుడు మేం చెప్పే కోర్టు మాత్రం అందుకు భిన్నం. ఆ మాటకు వస్తే.. మేం చెప్పే వసతులన్ని చదివిన తర్వాత.. ఏదో అతిశయంతో ఇవన్నీ చెప్పామని అనుకున్నా అనుకుంటారు. ఎందుకంటే.. తెలుగు రాష్ట్రాల్లో మరే కోర్టు లేనంత భిన్నంగా ఉండటం ఈ కోర్టు ప్రత్యేకత. ఇంతకీ ఆ కోర్టు ఎక్కడో కాదు తెలంగాణలోని వరంగల్ కోర్టు ఆవరణలో ఫ్యామిలీ కోర్టును.. పోక్సో కోర్టును ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
ఈ కోర్టులో భార్యభర్తల కౌన్సెలింగ్ కోసం రెండు గదుల్ని చక్కగా ఏర్పాటు చేయటమే కాదు.. కోర్టుకు హాజరయ్యే జంటలకు ఇబ్బంది లేకుండా.. వారి గురించి అందరికి తెలిసే అవకాశం లేకుండా ఉండేందుకు.. ప్రత్యేకమైన దారి.. గేట్లను ఏర్పాటు చేశారు. అంతేకాదు.. వీరికంటూ విడిగా ప్రత్యేక గదిని కూడా సిద్ధం చేశారు. అంతేకాదు. బాధితురాలు కోర్టులో ఉన్న వారికి కనిపించకుండా ఉండేందుకు వీలుగా.. ఒక పెద్ద అద్దాన్ని గోడకు ఏర్పాటు చేశారు.
బాధితురాలికి కోర్టు హాలులో ఉన్న వారంతా కనిపిస్తారు కానీ.. కోర్టులో ఉన్న వారికి మాత్రం బాధితురాలు మాత్రం కనిపించని రీతిలో జాగ్రత్తలు తీసుకున్నారు .దీంతో.. పోక్సో కేసుల్లో బాధితులైన యువతుల వివరాలు బయటకు తెలీకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అంతేకాదు.. ఫ్యామిలీ కోర్టు విషయానికి వస్తే.. అక్కడకు వచ్చే పెద్దలు మాట్లాడుకోవటానికి.. తమ మధ్య ఉన్న దూరాన్ని తగ్గించుకునేందుకు వీలుగా పార్కును ఏర్పాటు చేశారు. కోర్టుకు పెద్దలతోపాటు వచ్చే పిల్లలకు.. కోర్టు వాతావరణం ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వీలుగా పిల్లలకు ప్లే జోన్ ను కూడా సిద్ధం చేశారు. మొత్తంగా.. ఈ కోర్టు రెండు తెలుగు రాష్ట్రాల్లోని కోర్టు సముదాయాలకు భిన్నంగా ఉందని చెప్పక తప్పదు.