Begin typing your search above and press return to search.

ఫిపా వరల్డ్ కప్ ట్రోఫీ తయారీ వెనుక స్టోరీ ఏంటి?

By:  Tupaki Desk   |   18 Nov 2022 2:30 AM GMT
ఫిపా వరల్డ్ కప్ ట్రోఫీ తయారీ వెనుక స్టోరీ ఏంటి?
X
ప్రతి నాలుగేళ్లకోసారి జరిగే పుట్ బాల్ వరల్డ్ కప్ పోటీలకు ఉన్న క్రేజే వేరు. ప్రపంచవ్యాప్తంగా ఫుట్ బాల్ అభిమానులు సాకర్ సమరం ఎప్పుడెప్పుడు మొదలవుతుందా? అని వేయికళ్లతో ఎదురు చూస్తుంటారు. నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగే ఫుట్ బాల్ మ్యాచులను వీక్షించేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు.

ప్రత్యక్షంగా స్టేడియాలకు వెళ్లలేని అభిమానులు టీవీల్లో ప్రసారమయ్యే లైవ్ షోను తిలకిస్తూ తమ దేశమే గెలువాలని ప్రార్థనలు చేస్తుండటం ప్రతీచోట కనిపిస్తూ ఉంటుంది. ఇక 2022 సంవత్సరంలో ఫిపా ప్రపంచకప్ కతార్ వేదికగా జరగనుంది. నవంబర్ 20న ప్రారంభమయ్యే అంతర్జాతీయ పురుషుల పుట్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీలు డిసెంబర్ 18 వరకు జరగనున్నాయి.

మొత్తం 32 జట్లు ఐదు గ్రూపులుగా ఫిపా వరల్డ్ కప్ కోసం పోటీ పడనున్నాయి. కతార్ లోని 8 స్టేడియాల్లో ఈ పోటీలు నిర్వహించేందుకు ఆ దేశం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ క్రమంలోనే ఫిపా వరల్డ్ కప్ ను ఎవరు తయారు చేస్తారు? ట్రోఫీ చరిత్ర తదితర విషయాలను తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపుతున్నారు.

ఫిపా వరల్డ్ కప్ కు యాభై ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. 1971లో ఇటలీలోని సిల్వియో గాజాని అనే ఆర్టిస్ట్ తొలిసారి ఈ ట్రోఫీని రూపొందించాడు. నాటి నుంచి ఆ కుటుంబమే ట్రోఫీని తయారు చేస్తూ వస్తోంది. 18 క్యారెట్ల బంగారంలో ఫిపా వరల్డ్ కప్ ట్రోఫీని తయారు చేస్తారు. దీని ఎత్తు 37 సెం.మీ కాగా బరువు ఆరు కేజీలు. భూగోళాన్ని మోస్తున్నట్లుగా ఫిపా వరల్డ్ కప్ ట్రోఫిని రూపొందిస్తారు.

ప్రారంభంలో ట్రోఫి విలువ 50 వేల డాలర్లు ఉండేది. కానీ ప్రస్తుతం దీని విలువ రెండు కోట్ల డాలర్లకు చేరింది. అంటే మన కరెన్సీలో సుమారు 160 కోట్లు ఉంటుంది. ఫిపా వరల్డ్ కప్ గెలుపొందిన విజేతలకు ప్రతీసారి బంగారం ట్రోఫీని బహుకరిస్తారు. అయితే ఆ తర్వాత దానిని తిరిగి తీసుకొని నకలును ఇస్తారు.

వరుసగా మూడుసార్లు ఒకే జట్టు ట్రోఫీని గెలిస్తే పర్మినెంట్ గా వారికే ఆ బంగారు ట్రోఫీని ఇచ్చేస్తారు. ఈ క్రమంలోనే బ్రెజిల్ వరుసగా మూడు సార్లు ట్రోఫీని నెగ్గడంతో వారికే నిజమైన ట్రోఫీ దక్కింది. దీంతో మరోసారి కొత్త ట్రోఫీని తయారు చేయాల్సి వస్తోంది. ఈసారి కూడా ఇటలీకి చెందిన గాజాని కుటుంబమే ట్రోఫీని తయారు చేస్తుంది.

ఇక ఈ ట్రోఫీని జూలెస్ రిమెట్ ట్రోఫీగా పిలుస్తున్నారు. ఫిపా మూడో అధ్యక్షుడిగా ఉన్న రిమెట్ గౌరవార్థం ఆయన పేరును తాజా ట్రోఫీకి పెట్టారు. ఈ ఫిపా వరల్డ్ కప్ ట్రోఫీ ప్రపంచవ్యాప్తంగా 51 దేశాల్లో పర్యటించింది. మొత్తం 32 జట్టు ఈ ట్రోఫీని దక్కించుకునేందుకు పోటీ పడుతుండగా ఏ జట్టు విజేతగా నిలుస్తుందనేది మాత్రం ఆసక్తిని రేపుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.