Begin typing your search above and press return to search.
పెద్దాయన కుటుంబానికి తప్పిన ముప్పు!
By: Tupaki Desk | 17 Jan 2023 7:45 AM GMTఏపీలో వైసీపీ ప్రభుత్వంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ట్రబుల్ షూటరుగా పేరుంది. ఏ ఎన్నికైనా సీఎం వైఎస్ జగన్ కు ముందుగా గుర్తుకొచ్చేది.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే. చిత్తూరు జిల్లా రాజకీయాల్లో పెద్దాయనగా పెద్దిరెడ్డికి పేరుంది. అలాగే ఆయన కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీగా ఉన్నారు. అలాగే పలు జిల్లాలకు వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ గా కూడా వ్యవహరిస్తున్నారు.
కాగా అన్నమయ్య జిల్లా రాయచోటి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు, ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి సురక్షితంగా బయటపడ్డారు.
ఈ ప్రమాదంలో కాన్వాయ్‌లోని వాహనం పూర్తిగా దెబ్బతినగా, ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. రాయచోటి మండలం చెన్నముక్కపల్లెలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి పండుగకు బంధువుల వద్దకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న వాహనం కాన్వాయ్‌లోని ఒక వాహనాన్ని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పడంతో ఈ ఘటనలో వ్యక్తిగత కార్యదర్శి, సెక్యూరిటీ వ్యక్తి గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మంత్రి, ఆయన కుమారుడు ఎంపీ సహా కుటుంబ సభ్యులు కాన్వాయ్‌లో ప్రయాణిస్తుండగా, ఎదురుగా వస్తున్న ప్రైవేట్ వాహనం కాన్వాయ్‌లోని వాహనాన్ని ఢీకొనడంతో వారి వాహనం దాటిపోవడంతో వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.
మంత్రి, ఎంపీ ఒకే వాహనంలో ప్రయాణిస్తుండగా, ఇతర కుటుంబ సభ్యులు మరో రెండు వాహనాల్లో ఉన్నారు. భద్రతా సిబ్బంది, ప్రైవేట్ సెక్రటరీ అందరూ ఇతర వాహనాల్లో ప్రయాణిస్తుండగా వాటిలో ఒకటి ఢీకొట్టింది. మంత్రి, ఎంపీ క్షేమంగా ఉండడంతో జిల్లా అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.