Begin typing your search above and press return to search.

ఆచారం: కుటుంబమంతా చూస్తుండగా సెక్స్

By:  Tupaki Desk   |   1 Jun 2016 10:53 AM GMT
ఆచారం: కుటుంబమంతా చూస్తుండగా సెక్స్
X
ఎంత అభివృద్ధి చెందిన దేశాల్లో అయినా.. ఎంత ఫ్రీ థింకింగ్ ఉన్న చోటయినా.. శృంగారం అనేది పర్సనల్ వ్యవహారమే. ముద్దులు కౌగిలింతల వరకు బహిరంగంగా కానిచ్చేసినా పర్వాలేదు కానీ సెక్స్ మాత్రం నాలుగ్గోడల మధ్య.. ఎవరూ లేకుండానే చేసుకుంటారు. కొందరు పర్వర్ట్స్ గ్రూఫ్ సెక్స్ చేసుకుంటే అది వేరే సంగతి. ఐతే తమ కుటుంబ సభ్యుల్ని దగ్గర పెట్టుకుని ఓ జంట శృంగారంలో పాల్గొనడం అనేది ఎక్కడా జరగదు.

కానీ సింగపూర్ లోని వుడ్ ల్యాండ్ టౌన్ కు చెందిన ఓ వంశానికి మాత్రం ఇలాంటి ఆచారం ఉందట. ఆ కుటుంబ ఆచారం ప్రకారం కొత్తగా పెళ్లి చేసుకున్న ఏ జంట అయినా సరే.. తమ మొదటి శృంగారాన్ని కుటుంబ సభ్యులందరి ముందు సాగించాలట. ఈ తతంగాన్నంతా ఆ కుటుంబంలోని సభ్యులు వీడియో కూడా తీసుకోవచ్చట. ఇంకో విడ్డూరమైన విషయం ఏంటంటే.. కొత్త జంట శృంగారంలో పాల్గొంటుంటే అబ్బాయి తల్లి పక్కనే ఉండి.. సెక్స్ కు సంబంధించి సలహాలు సూచనలు ఇస్తుందట. ఇలా ఓ కుటుంబం దగ్గరుండి శృంగార తంతు నడిపించిన వీడియో ఒకటి ఈ మధ్యే ఇంటర్నెట్లోకి వచ్చింది.

ఇంతకంటే సెన్సేషన్ ఏముంటుంది మరి.. అందుకే ఆ వీడియో వైరల్ అయిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో గురించి.. వాళ్ల సంప్రదాయం గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఐతే మొత్తం ప్రపంచానికి ఇది తెలిసిపోయినా.. దీని గురించి ఆ కుటుంబం చింతించట్లేదు. తొలిసారి కొత్త జంట మధ్య శృంగార ఘట్టానికి సాక్షులుగా ఉండడం.. ఆ మధుర క్షణాలను దగ్గరుండి చూడడం తమకు గర్వకారణంగా ఉందని ఆ వంశస్థులు ప్రకటించడం విశేషం.