Begin typing your search above and press return to search.
టాప్ హీరోయిన్ ఇంట్లో సోదాలు.. భారీగా డ్రగ్స్, మద్యం స్వాధీనం
By: Tupaki Desk | 6 Aug 2021 8:31 AM GMTసినీ తారలు అన్నాక డ్రగ్స్, మద్యం తీసుకోవడం కామన్ గా మారింది. బాలీవుడ్ లో అయినా పక్కదేశాల్లో అయినా ఇదే తంతు నడుస్తోందా? అంటే ఔననే సమాధానం వస్తోంది.ఇప్పటికే బాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం రేపాయి. ఇప్పుడు పక్క దేశం బంగ్లాదేశ్ లోనూ డ్రగ్స్ రాకెల్ కలకలం సృష్టిస్తోంది.
తాజాగా ప్రముఖ బంగ్లాదేశ్ నటి పోరి మోనిని రాపిడ్ యాక్షన్ బెటాలియన్ (ఆర్.ఏ.బీ) అదుపులోకి తీసుకుంది. జూన్ 8న బోట్ క్లబ్ లో తనపై అత్యాచారం చేసి చంపేందుకు కొంతమంది ప్రయత్నించారని పోరి మోనీ ఆరోపించింది. దీనిపై ఆరాతీసిన పోలీసులు బంగ్లాదేశ్ సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ రాకెట్ పై కన్నేశారు.
హీరోయిన్ కు కూడా ఇందులో సంబంధాలున్నాయని..అందుకే ఈమెపై కొందరు దాడి చేసేందుకు చూస్తున్నారని పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. ఈ క్రమంలోనే ఢాకాలోని బనానీలో పోరిమోనీ నివాసంలో బుధవారం నాలుగు గంటల పాటు సోదాలు నిర్వహించారు. అనంతరం పలు కీలక ఆధారాలను సేకరించి ఆమెను ఎలైట్ ఫోర్స్ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లారు.
ప్రముఖ నటిని పోరిమోనిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. తనిఖీల్లో ఆమె ఇంటి నుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్, మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
ఇదే పోరీ మోనీ ఇటీవలే రాజకీయ నాయకుడు ఉద్దీన్ మహమూద్ తనపై దాడి చేసినట్లు జూన్ లో ఆరోపించింది. లైంగిక వేధింపులకు పాల్పడినట్టు తెలిపింది.ఈ నిందితుడు బంగ్లాదేశ్ ఐజీకి సన్నిహితుడని..అందుకే కేసులు నమోదు చేయలేదని పోరీ మోనీ పేర్కొంది. ఈ క్రమంలోనే ఆమె తాజాగా డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం సంచలనంగా మారింది.