Begin typing your search above and press return to search.
మంచు దుప్పటిలో ప్రఖ్యాత క్రికెట్ మైదానం.. మానవ తప్పిదమే
By: Tupaki Desk | 13 Dec 2022 10:37 AM GMTఇంగ్లండ్ అంటే అనిశ్చత వాతావరణం. ఎప్పుడు వాన పడుతుందో? ఎప్పుడు ఎండ కాస్తుందో చెప్పలేని పరిస్థితి. కాసేపు తెరిపి.. అంతలోనే హోరువాన.. అయితే ఇలాంటి వాతావరణంలోనూ క్రికెట్ ఆడడంలో ఉన్న మజా వేరు. అందుకే ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ కు పెట్టింది పేరు. అక్కడ రాణించిన విదేశీ క్రికెటర్లు భవిష్యత్ లో ఎంతో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. భారత్ మాజీ కెప్టెన్లు సౌరభ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ ల కెరీర్ మలుపు తిరిగింది ఇంగ్లండ్ లోనే. 1996 పర్యటనలో ఇంగ్లండ్ గడ్డపై వరుసగా రెండు టెస్టుల్లో సెంచరీలు బాది గంగూలీ దాదా అయిపోయాడు. అదే సిరీస్ లో నిలకడగా రాణించి ద్రవిడ్ మిస్టర్ వాల్ గా నిలిచిపోయాడు.
ఓ లార్డ్స్.. ఓ ఓవల్.. ఇంగ్లండ్ క్రికెట్ కు పుట్టినిల్లు. ఇక అక్కడి లార్డ్స్ మైదానం క్రికెట్ మక్కాగా ప్రాచుర్యం పొందింది. లార్డ్స్ లో సెంచరీ సాధిస్తే అతడి పేరు చరిత్రలో నిలిచిపోతుంది. చాలామంది గొప్ప క్రికెటర్లకు లార్డ్స్ లో శతకం ఓ కల కావడం దీనికి ఉదాహరణ. మరోవైపు లార్డ్స్ బాల్కనీలో కూర్చుని టెస్టు మ్యాచ్ ను ఆస్వాదించడం గొప్ప అనుభూతిగా చెబుతుంటారు. అందులోనూ మరో లండన్ మైదానం కూడా ప్రసిద్ధమైనదే. అదే ఓవల్. ఆకారం ప్రకారంగా దీనికి ఓవల్ అనే పేరు వచ్చింది. ఇటీవల జూలైలో టీమిండియా ఇక్కడ ఓ మ్యాచ్ కూడా ఆడింది. అయితే, లార్డ్స్ అంతగా కాకపోయినా..దీనికో ప్రత్యేకత ఉంది. అదేమంటే ఏటా సీజన్ చివరి మ్యాచ్ ను ఇంగ్లండ్ జట్టు ఇక్కడ ఆడుతుంది.
అనంతరం కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుంటుంది.
'మంచె'త్తింది.. పాశ్చాత్య దేశాలు కాబట్టి పెద్దఎత్తున మంచు కురుస్తుంటుంది. అందులోనూ ఇది ఇంగ్లండ్ శీతాకాలం. బహుశా ఇప్పుడు గనుక మీరు లండన్ వెళ్తే ఓవల్ మైదానాన్ని ఎక్కడ ఉందో వెదుక్కోవాల్సి ఉంటుందేమో? అంతగా మంచు దుప్పటిలో ఉందీ స్టేడియం. యూకేలో ఇప్పుడు ఉష్ణోగ్రతలు మైనస్ 10- 12 డిగ్రీలున్నాయి. హిమపాతం కురుస్తోంది.ఈ నేపథ్యంలో బ్రిటన్‌లో ఎటు చూసినా మంచుతో నిండిపోయిన ప్రదేశాలే. ఓవల్ క్రికెట్ స్టేడియం కూడా ఇందుకు మినహాయిపు కాదు. దానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. మైదానం 'మంచు దుప్పటి' కింద ఉన్నట్లుంది. ''వాతావరణ మార్పుల కారణంగానే ఇలాంటి విపత్కర పరిస్థితులు. ప్రకృతితో ఆటలాడితే మనుషుల గతి అధోగతే! ఏదేమైనా.. ఓవల్ మైదానం సూపర్‌గా కనిపిస్తోంది. క్రికెట్‌కు బదులు ఇక్కడ ఐస్ హాకీ ఆడుకోవచ్చు'' అంటూ కామెంట్లు చేస్తున్నారు.
కాగా ఉష్ణోగ్రతలు పెద్ద ఎత్తున పడిపోతున్న నేపథ్యంలో బ్రిటన్ ప్రజలు చలికి వణికిపోతున్నారు. బయటకు వెళ్లే పరిస్థితి లేక ఇబ్బందులు పడుతున్నారు. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. దక్షిణ లండన్‌లోని కెన్నింగ్‌టన్‌లో ఉందీ స్టేడియం. 1845లో దీనిని ప్రారంభించారు. అప్పటి నుంచి ఇది సర్రే క్రికెట్ కంట్రీ క్లబ్‌కు హోం గ్రౌండ్‌గా ఉంది. 1880లో మొదటి తర్జాతీయ టెస్టుకు ఇంగ్లండ్ ఇక్కడే ఆతిథ్యమిచ్చింది. కాగా ప్రతి సీజన్‌లో స్వదేశంలో ఆఖరి టెస్టును ఇంగ్లండ్ ఇక్కడే ఆడటం ఆనవాయితీ.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.