Begin typing your search above and press return to search.
రష్యాను వణికించిన ప్రిగొజిన్ కు ఈ ఫ్యాన్ బెల్ట్ ఏమిటి?
By: Tupaki Desk | 25 Jun 2023 12:18 PM GMTఅనేక నాటకీయ పరిణామల మధ్య రష్యా దాదాపు అంతర్యుద్ధం అంచుల దాకా వెళ్లింది. అధ్యక్షుడు పుతిన్ పెంచి పోషించిన కిరాయి సేన "వాగ్నర్ గ్రూపు" ఆయనపైనే తిరుగుబాటు జెండా ఎగురవేసింది. అయితే ఈ తిరుగుబాటు అంతర్యుద్ధానికి అడుగు దూరంలో ఆగిపోయింది. ఈ సమయంలో ప్రిగొజిన్ పై రొస్తోవ్ వాసులు చూపించిన అభిమానం ఆసక్తిగా మారింది.
అవును.... ఒకపక్క రష్యా అంతర్యుద్ధానికి కారకుడవుతున్నాడంటూ దేశ పార్లమెంట్ విమర్శిస్తుంది.. మరోపక్క క్రిమియా గవర్నర్, లుహాన్స్క్, దొనెట్స్క్ నేతలు.. ప్రిగోజిన్ వల్ల దేశానికి ప్రమాధం అని చెబుతున్నారు. మరిముఖ్యంగా... ప్రిగోజిన్ వెన్నుపోటు పొడిచినట్లు అధ్యక్షుడు పుతిన్ ప్రసంగిస్తున్నారు.. అతడు రష్యా దేశానికే ప్రమాదమని స్పష్టం చేస్తున్నారు. అయినా కూడా... ప్రిగోజిన్ ను ఓ సెలబ్రిటీలా చూశారు రొస్తోవ్ వాసులు!
ఒక్క రోజులో రష్యా అధినాయకత్వానికి ముచ్చెమటలు పట్టించిన వాగ్నర్ గ్రూపు అధిపతి ప్రిగోజిన్.. రొస్తోవ్ ను వీడి వెళ్తున్న సమయంలో గాల్లోకి కాల్పులు జరిపి సంబరాలు చేసుకొన్నారు. ఈ సమయంలో రొస్తోవ్ వాసులు ప్రిగోజిన్ ను ఓ సెలబ్రిటీలా చూస్తూ.. అతడితో సెల్ఫీలు దిగడానికి ఎగబడ్డారు. ఇది స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.
ఇదిలా ఉండగా మరోపక్క... రష్యన్ జైళ్లలో బలవంతంగా నిర్బంధించిన ఖైదీల సమూహం "స్టోమ్ జెడ్".. ప్రిగోజిన్ కు తమ మద్దతు ప్రకటించింది. అయితే రష్యాలో పుతిన్ తీసుకుంటున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రిగోజిన్ వ్యాఖ్యానిస్తుండటమే ఈ మార్కు అభిమానానికి, మద్దతుకు కారణం అని తెలుస్తుంది.
"ఈ దేశానికి కొత్త అధ్యక్షుడు వస్తారు. అవినీతి, అబద్ధాలు, వంచన, బ్యూరోక్రసీలో మా మాతృభూమి మగ్గిపోవాలని కోరుకోవడం లేదు. పుతిన్ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు" అంటు ప్రిగోజిన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీంతో... పుతిన్ వ్యతిరేకులకు ప్రిగొజిన్ ఒక హీరోలా కనిపిస్తున్నాడనే కామెంట్లు కనిపిస్తున్నాయి.
ప్రిగోజిన్ రోస్తోవ్ నగరంలోని మిలిటరీ హెడ్ క్వార్టర్స్ నుంచి వాహనంలో వెళ్లిపోతున్నారని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. ప్రిగోజిన్ రష్యా నుంచి బెలారస్ కు వెళ్ళిపోతున్నారని, రక్తపాతాన్ని నివారించడానికి ఆయనతో పాటు వాగ్నర్ దళాల మీద ఉన్న అభియోగాలన్నింటినీ అధికారులు ఉపసంహరించుకున్నారని రష్యా ప్రభుత్వ మీడియా కూడా ప్రకటించింది.
మరోపక్క ఉక్రెయిన్ మాత్రం రష్యాలో అంతర్యుద్ధంతో కాస్త ఊపిరి పీల్చుకుంది. పుతిన్ కి ఇదే సరైన సమాధానం అని సంబరపడుతుంది. "ఇది కేవలం ఆరంభం మాత్రమే" అని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీకి సన్నిహుతుడైన ఓ ప్రతినిధి వ్యాఖ్యానించారు.