Begin typing your search above and press return to search.

తీరం దాటిన 'ఫొని' తుఫాన్.. ఒడిషా అతలాకుతలం

By:  Tupaki Desk   |   3 May 2019 6:59 AM GMT
తీరం దాటిన ఫొని తుఫాన్.. ఒడిషా అతలాకుతలం
X
ఒడిషా - ఏపీ రాష్ట్రాలను భయపెట్టిన ఫోని తుఫాన్ తీరం దాటింది. తుఫాన్ ఉదయం 10.30 నుంచి 11.30 గంటల మధ్య ఒడిషాలోని గోపాల్ పూర్ చాంద్ బలీ మధ్య తీరం దాటి 200కి.మీల పెను గాలులు - అతి భారీ వర్షాలతో బీభత్సం సృష్టించింది. తుఫాన్ తీవ్రతను అంచనావేసి అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు.

ఫొని దెబ్బకు ఒడిశా అతలాకుతలమైంది. 1999లో ఒడిషాను సూపర్ సైక్లోన్ భారీగా విరుచుకుపడి 10వేల మంది ప్రాణాలు తీసింది. ఆ తర్వాత అంత భారీ స్థాయిలో తుఫాన్ రావడం ఇదే ప్రథమమని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే జనాలను బయటకు రావద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వారంతా బిక్కుబిక్కుమనుకుంటూ కాలం గడుపుతున్నారు.

తుఫాన్ కారణంగా ఒడిషాలోని గోపాల్ పూర్ - పూరీ - భువనేశ్వర్ - పారదీప్ - చాంద్ బాలీ - కళింగపట్నం లలో పెను గాలులు - భారీ వర్షం కురుస్తోంది. దాదాపు 200 కి.మీల వేగంతో గాలులు వీస్తుండడం ప్రజలు భాయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

తుఫాన్ తీవ్రత పూరి - కటక్ - గజపతి - గంజా - జగత్ సింగ్ పూర్ - కేంద్రపుర - జాజ్ పూర్ - భద్రక్ - బాలాసోర్ లలో భారీగా ఉంది. ఇక్కడ భారీ నష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు. తుఫాన్ కారనంగా తీరప్రాంతాలు - లోతట్టు ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఆర్మీ - నేవి - ఎయిర్ ఫోర్స్ - కోస్ట్ గార్డ్ - డిజాస్టర్ మేనేజ్ మెంట్ టీంలు రంగంలోకి దిగాయి. ప్రధాని మోడీ పరిస్తితిని సమీక్షిస్తున్నారు.

తుఫాన్ కారణంగా ఒడిషాలో 147 రైళ్లను - విమానా సర్వీసులను నిలిపివేశారు. టూరిస్టులను తరలించేందుకు ఏర్పాట్లు చేవారు.