Begin typing your search above and press return to search.
ఏ ఒక్కరికి భయంలేదు ..ఫుట్‌బాల్ మ్యాచ్‌కు 30,000 మంది...
By: Tupaki Desk | 6 Jun 2020 7:50 AM GMTప్రపంచం మొత్తం వైరస్ భయంతో జనసమూహం ఉండే అన్ని కార్యక్రమాలను వాయిదా వేసుకుంటుంటే వియత్నాం మాత్రం ఏ యంత్రం జాగ్రత్తలు తీసుకోకుండా స్టేడియంలో ఫుట్ బాల్ మ్యాచ్ నిర్వహించింది. ఈ మ్యాచ్ కు సుమారు 30,000 మంది ఫుట్‌బాల్ అభిమానులు హాజరయ్యారు. వారిలో ఏ ఒక్కరు కూడా భౌతిక దూరం నిబంధన పాటించలేదు.
వైరస్ కారణంగా గత కొన్ని రోజులుగా క్రీడా లోకం పూర్తిగా స్తంభించిపోయింది. మార్చి చివరి వారం నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ జరగలేదు. అయితే ఇప్పుడిప్పుడే వైరస్ నుంచి కాస్త కొలుకొని క్రీడా కార్యకలాపాలను కొన్ని దేశాలు పునరుద్దరిస్తున్నాయి. అయితే, వ్యాధి వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం వియత్నాం ఓ ఫుడ్ బాల్ మ్యాచ్ ను 30 వేలమందితో ..ఏ మాత్రం జాగ్రత్తలు తీసుకోకుండా నిర్వహించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. స్టేడియంలో అభిమానులు భౌతిక దూరం పాటించేలా ఎలాంటి మార్కింగ్ లు కూడా ఏర్పాటు చేయనట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా ముఖానికి మాస్క్‌లు కూడా చాలా తక్కువ మంది మాత్రమే ధరించారు. అయితే మ్యాచ్ చూడటానికి వచ్చిన అభిమానులకు థర్మల్ స్క్రీనింగ్ టెస్టులు, శానిటైజేషన్ చేసినట్లు స్టేడియం అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఓ ఫుట్‌బాల్ ప్రేమికుడు మాట్లాడుతూ..‘ఇన్ని రోజులు ఫుట్‌బాల్ మ్యాచ్ చూడకుండా ఉంటే పిచ్చెక్కిపోయింది. కరోనా భయం ఉంటే మ్యాచ్‌లు చూడటానికి రాకండి. అంతేకాని మ్యాచ్‌లు జరగకుండా అడ్డుకోకండి’ అంటూ వేడుకున్నాడు.
కాగా, వియత్నాంలో కరోనా కేసులు అతి తక్కువగా నమోదయ్యాయి. 328 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఒక్కరు కూడా మృతి చెందలేదు. కాగా, ఇంగ్లండ్, స్పెయిన్‌లో కూడా ఫుట్‌బాల్ మ్యాచ్‌లు నిర్వహించేందుకు ఆయా దేశాల అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే, తక్కువ కేసులు ఉన్నాయి అని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ..భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.