Begin typing your search above and press return to search.
టీం ఇండియా చేతులెత్తేసినట్లేనా ?
By: Tupaki Desk | 1 Nov 2021 7:33 AM GMTమొదటి మ్యాచ్ కు రెండో మ్యాచ్ కు పోల్చుకుంటే టీం ఇండియా ఆటతీరు ఏ మాత్రం మారలేదు. పాకిస్ధాన్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో మన జట్టు ఎంత ఘోరం గా విఫలమైందో న్యూ జిల్యాండ్ తో జరిగిన రెండో మ్యాచ్ లో కూడా అంతే ఘోరం గా ఫెయిలైంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటి లోను ఫెయిలైన జట్టు యావత్ దేశం లోని అభిమానులను తీవ్ర నిరాశ లో ముంచేసింది. ఆటల్లో గెలుపోటములు చాలా సహజమే. కానీ మరీ ఇంత ఘోరం గా భారత జట్టు ఓడి పోతుందని అభిమానులు ఊహించుండరు.
క్వార్టర్ ఫైనల్లో కి ప్రవేశించాలంటే కచ్చితం గా గెలిచి తీరాల్సిన న్యూ జిల్యాండ్ మ్యాచ్ లో మన జట్టు ప్రదర్శన అత్యంత పేలవం గా ఉండటం అభిమానులను షాక్ కు గురిచేసింది. ఇక్కడ గమనించాల్సిందేమంటే న్యూ జిల్యాండ్ కు కూడా ఇదే మ్యాచ్ చాలా కీలకం. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన భారత్ బ్యాట్స్ మెన్ను ప్రత్యర్ధి బౌలర్లు కట్టు దిట్టమైన బౌలింగ్ తో చాలా ఇబ్బంది పెట్టారు. మొదటి 50 పరుగుల్లోపే నాలుగురు బ్యాట్స్ మెన్ అవుటయ్యారంటే బౌలింగ్ తో కివీస్ ఎంతగా ఇబ్బంది పెట్టారో అర్ధం చేసుకోవచ్చు.
కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ ఇలా ఎవరు కూడా పెద్దగా స్కోర్లు చేయ కుండానే పెవిలియన్ కు తిరిగెళిపోయారు. ఏదో చివరలో హార్దిక్ పాండ్యా, రవీంద్రజడేజాలు చెరో 20 పరుగులు దాటారు కాబట్టే భారత్ 110 పరుగులు చేయగలిగింది. మధ్య మధ్యలో ఓ ఫోర్, ఓ సిక్సర్ కొట్టినా అవేవీ స్కోరుబోర్డును పరుగులు పెట్టించలేకపోయింది. సింగిల్ తోనే భారత్ బ్యాట్స్ మెన్ స్కోరును పరుగులు తీయించేందుకు నానా అవస్థలు పడ్డారు.
111 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన కివీస్ ఓపెనర్లు చాలా తేలిగ్గా కొట్టేశారు. కాక పోతే వాళ్ళే పరుగుల కోసం తొందర పడటం తో రెండు వికెట్లు కోల్పోయారు. భారత్ చేసిన స్కోర్ ను న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ 14.3 ఓవర్లలోనే చేయటం గమనార్హం. కచ్చితంగా చెప్పాలంటే ఇటు బ్యాటింగ్ లో విఫల మైన భారత్ అటు బౌలింగ్ లో కూడా ఫెయిలైందనే చెప్పాలి. డిఫెండ్ చేసుకోవడానికి గౌరవ ప్రదమైన స్కోరు కూడా లేకపోవటంతో బౌలర్లు చేయగలిగింది కూడా ఏమీ లేకపోయింది.
పాకిస్థాన్ తో ఘోరం గా ఓడిపోయిన భారత జట్టు ఎలాంటి గుణపాఠం నేర్చు కోలేదని అర్ధమై పోతోంది. అసలు ఓ వ్యూహమంటు లేకుండా నే ఆటలోకి దిగినట్లు అర్థమై పోతోంది. రెండు మ్యాచ్ ల్లో మన వాళ్ళ ఆటతీరు చూసిన తర్వాత ఆట గాళ్ల మధ్య ఏమన్నా గొడవలుండి దాని ప్రభావం ఆట తీరు పై పడిందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ఇలాంటి ఘటనలు గతంలో జరిగాయి కాబట్టే అభిమానుల్లో అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఏదే మైనా వరుస గా రెండు మ్యాచ్ ల్లో ఓడిపోవటంతో క్వార్టర్స్ లోకి ప్రవేశించాలనే ఆశలు దాదాపు మూసుకుపోయినట్లే.