Begin typing your search above and press return to search.
ప్రేమతో నేతలకు దిమ్మ తిరిగే షాకిస్తున్నారట!
By: Tupaki Desk | 26 Jun 2019 7:54 AM GMTఅవేశంతోనో.. ఆగ్రహంతోనే దెబ్బేయటం కష్టం కానీ.. ప్రేమతో.. అభిమానంతో కోలుకోని షాకివ్వటం ఈజీ అన్న విషయం తెలంగాణ ప్రజాప్రతినిధులకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గతంలో ఆగ్రహంతో ప్లాన్ చేసి బుక్ చేసే తీరుకు తాజాగా అభిమానంతో బుక్ చేస్తున్న వైనం నేతలకు విస్మయానికి గురి చేస్తోంది.
టెక్నాలజీ అందుబాటులోకి వచ్చి.. స్మార్ట్ ఫోన్లు చేతికి వచ్చాక నేతలకు.. రాజకీయ ప్రముఖులకు పెద్ద తలనొప్పిగా మారిందట. ప్రేమను కురిపించేస్తూ.. అన్నా.. మీకు ఇలా జరుగుడేందే? అంటూ శోకాలు తీస్తున్న అభిమానుల్ని ఊరడించే ప్రయత్నంలో కాస్త ఎక్కువ మాట్లాడటం నేతలకు అలవాటే. తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ లోనూ అలానే జరిగింది.
అన్నా మీకు ఇంత అన్యాయం జరుగుడేందే? మీ మాటలకు విలువ లేకుండా పోవటం ఏమిటి? ఎంతటోడైనా సరే మీ ముందుకు వచ్చి మాట్లాడటమే భయమవుతుంది.. అలాంటి సదరు ఛోటా నేత అలా మాట్లాడేస్తాడా? వాడికెంత ధైర్యమన్నా? ఇలాంటి వెన్నపూస మాటలతో సదరు నేతలు చెలరేగిపోవటం.. ఆ సందర్భంగా నోరు జారుతున్నారు. ఈ మొత్తాన్ని రికార్డు చేసి సోషల్ మీడియాలో వదులుతున్న వైనం ఇప్పుడు నేతలకు తలనొప్పిగా మారుతోంది.
తాజాగా రాజగోపాల్ రెడ్డి వ్యవహారమే తీసుకుంటే.. అభిమాని పేరుతో వెన్నపూస మాటలు మాట్లాడిన కార్యకర్త మాటలకు విశ్వాసం పెంచే క్రమంలో బీజేపీలో మనమే తెలంగాణ సీఎం అన్న ఎక్కువ మాట తాజాగా వైరల్ కావటం.. బీజేపీ నేతలు సీరియస్ కావటం జరిగిపోయాయి.
పార్టీలోకి ఇంకా అడుగు పెట్టక ముందే..సీఎం కోరికను బయటపెట్టిన రాజగోపాల్ రెడ్డి వైనంపై తెలంగాణ కమలనాథులు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఎంతో కాలంగా పార్టీలో ఉన్న తమను కాదని.. పార్టీలోకి ఇంకా ఎంట్రీ ఇవ్వకుండానే సీఎం పోస్టు గురించి మాట్లాడటం రాజగోపాల్ రెడ్డికి కచ్ఛితంగా హద్దులు మీరినట్లేనని.. కాంగ్రెస్ లో మాదిరి ఏది పడితే అది మాట్లాడితే మొదటికే మోసం వస్తుందన్న విషయాన్ని గుర్తిస్తే మంచిదన్న మాట వినిపిస్తోంది. రాజగోపాల్ రెడ్డి లాంటోళ్లకు ఇలాంటివి అర్థమవుతాయా?