Begin typing your search above and press return to search.

బాసూ.. నువ్ మాత్రం రిటైర్ అవొద్దు.. ఫ్యాన్స్ రిక్వెస్ట్!

By:  Tupaki Desk   |   3 Nov 2020 2:30 PM GMT
బాసూ.. నువ్ మాత్రం రిటైర్ అవొద్దు.. ఫ్యాన్స్ రిక్వెస్ట్!
X
యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ప్రపంచంలో ఐపీఎల్ సహా పలు టీ20 టోర్నీలలో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. ప్రపంచంలో గేల్ లేని టోర్నమెంట్ అంటూ ఏదీ లేదు.టీ20 లీగ్ లలో అతడు బాదిన సిక్సర్ల సంఖ్య 1000 దాటింది. అతడి దరి దాపుల్లో కూడా ఎవరూ లేరంటే అతడి బ్యాటింగ్ విధ్వంసం ఏపాటిదో అర్థం అవుతుంది. గేల్ అన్ని దేశాల టోర్నమెంట్లలోనూ పాటిస్పేట్ చేస్తున్నాడు. ఐపీఎల్లో గేల్ పంజాబ్ తరపున ఆడుతున్నాడు. అయితే ఈ విధ్యంస బ్యాట్స్ మెన్ కి ముందుగా బెంచ్ కే పరిమితం అయ్యాడు. సగం టోర్నమెంట్ పూర్తయ్యాక వరుస ఓటముల్లో చిక్కుకున్న సమయంలో గేల్ కు అవకాశం వచ్చింది. అతడు వచ్చి రాగానే అర్ధ సెంచరీ చేసి జట్టును విజయాల బాట పట్టించాడు.

టోర్నీలో 7 మ్యాచ్ లు ఆడిన గేల్ 288 పరుగులు చేశాడు. అందులో 3 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఒక మ్యాచ్ లో 99 పరుగులతో సెంచరీ కోల్పోయాడు. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ లో జరిగిన కీలక మ్యాచ్ లో పంజాబ్ ఓడిపోవడంతో ప్లే ఆఫ్స్ ఆడకుండానే పంజాబ్ ఇంటి ముఖం పట్టింది. కాగా సోమవారం క్రిస్ గేల్ చేసిన ట్వీట్ అభిమానులను అయోమయంలో పడేసింది. ' నా సీజన్ పూర్తయిన మీరంతా ఈ టీ20 లీగ్ ను వీక్షిస్తూ తరించండి' అని పేర్కొంటూ ధన్యవాదాలు తెలిపాడు. గేల్ ట్వీట్ తో అతడు రిటైర్ అవుతున్నాడేమోనని భావిస్తూ.. ఫ్యాన్స్ అలా మాత్రం చేయొద్దని విజ్ఞప్తి చేయడం మొదలు పెట్టారు. రిటైర్ వద్దంటూ అభిమానుల వద్ద నుంచి గేల్ కు భారీగా విజ్ఞప్తులు వచ్చాయి. మీరు మరిన్ని సీజన్లు ఆడాలంటూ విన్నవించారు. ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి క్రిస్ గేల్ ను ఆడించి ఉంటే మరిన్ని విజయాలు దక్కి ఉండేవని, ఇలా ఇంటి దారి పట్టే పరిస్థితి వచ్చి ఉండేది కాదని అంటున్నారు.