Begin typing your search above and press return to search.

చిరు అతి మంచితనంపై అభిమానుల అసంతృప్తి!

By:  Tupaki Desk   |   5 Dec 2022 2:30 PM GMT
చిరు అతి మంచితనంపై అభిమానుల అసంతృప్తి!
X
ప్రముఖ సినీ నటుడు చిరంజీవి ప్రస్తుతం క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. వరుసగా సినిమాలు చేస్తూ తన అభిమానులను ఆయన అలరిస్తున్నారు. ఇటీవల గాడ్‌ఫాదర్‌తో మంచి హిట్‌ కొట్టిన చిరంజీవి సంక్రాంతికి వాల్తేరు వీరయ్యగా ఫుల్‌ మాస్‌ మసాలాతో తన అభిమానులకు మరోసారి మంచి విందు అందించనున్నారు. వాల్తేరు వీరయ్య సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉంది.

కాగా చిరంజీవికి ఉన్న ఇమేజ్‌ను, ఆయన వెనుక ఉన్న కాపు సామాజికవర్గాన్ని ఆకర్షించడమే లక్ష్యంగా పలు పార్టీలు ఆయనను తమ పార్టీలో చేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నా ఆయన నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. తన మద్దతు జనసేన పార్టీకేనని.. తన తమ్ముడు ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకున్నారు. రాజకీయాలంటే మాటలు పడాలని.. అలాగే మాటలు అనాలని కూడా ఇటీవల చిరంజీవి చెప్పిన సంగతి తెలిసిందే.

తన తమ్ముడు రాజకీయాలకు సరైనవాడని.. మాటలు అంటాడు.. అనిపించుకుంటాడని చిరు పేర్కొన్నారు. కాగా చిరు అతి మంచితనంపై అభిమానులకు అసంతృప్తి ఎప్పటి నుంచో ఉంది. ప్రజారాజ్యం పార్టీ సమయంలో ఎన్ని నిందలు వేయాలో అన్ని నిందలు వేసిన జీవిత రాజశేఖర్‌ కుమార్తెకు ఆ తర్వాత ఎంబీబీఎస్‌ సీటు ఇప్పించడం వంటివి చిరు అభిమానులకు నచ్చలేదు.

తాజాగా ఒక కార్యక్రమంలో కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిని చిరు పలకరించిన వ్యవహారంపైన చిరు అభిమానుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. గతంలో పవన్‌ కల్యాణ్‌ను లంజా కొడుకు అంటూ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పబ్లిక్‌గా తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై నిరసన వ్యక్తం చేయడానికి కాకినాడ వెళ్లిన జనసేన కార్యకర్తలను, ఆ పార్టీ మహిళలను ద్వారంపూడి తన అనుచరుల చేత చితకబాదించారు.

అంతేకాకుండా ఇటీవల సైతం తూర్పుగోదావరి జిల్లాలో పవన్‌ కల్యాణ్‌ ఎక్కడ పోటీ చేసినా తాను ఆ నియోజకవర్గం బాద్యత తీసుకుంటానని.. పవన్‌ను చిత్తుగా ఓడిస్తానని ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే.

అలాంటి ద్వారంపూడిని చిరంజీవి పలకరించడం ఏమిటని.. ఇంత అతి మంచితనం ఉండటం వల్లే మెగా హీరోలు దెబ్బయిపోతున్నారని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌ను అసభ్యంగా దూషించిన ద్వారంపూడిని చిరు పట్టించుకోకుండా ఉండాల్సిందని అంటున్నారు.

మరోవైపు మరికొంతమంది మాత్రం ముందుగా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డే చిరంజీవిని పలకరించారని చెబుతున్నారు. దీంతో చిరంజీవి సైతం మర్యాదపూర్వకంగా ద్వారంపూడిని పలకరించాని అంటున్నారు. అంతేతప్ప చిరంజీవి తనంతట తానుగా ద్వారంపూడి పలకరించలేదని చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.