Begin typing your search above and press return to search.
వాజ్ పేయి అంతిమయాత్రలో మోడీ అలా చేశారు
By: Tupaki Desk | 17 Aug 2018 11:10 AM GMTభారతరత్న.. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి కన్నుమూత కోట్లాది మంది జనుల్లో విషాదాన్ని నింపింది. తాను నమ్మిన విలువల్ని పాటిస్తూ సాగిన ఆయన జీవితం ఆదర్శప్రాయంగా చెప్పాలి. ఆయన లేని లోటు ఎప్పటికి తీర్చలేనిదిగా చెప్పక తప్పదు.
కొన్నేళ్లుగా అనారోగ్యంతో ప్రజాజీవితానికి దూరంగా ఉన్నప్పటికీ.. ఆయన మరణవార్త తెలుసుకున్నంతనే వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా పలువురు ప్రతినిధులు ఆయన్ను కడసారి చూసేందుకురావటం.. నివాళులు అర్పించటం చూస్తే..నిజాయితీగా పని చేసిన వారు ప్రజల మనసుల్లో ఎలా నిలుస్తారన్నది ఇట్టే అర్థమవుతుంది.
వాజ్ పేయ్ ఇక లేరన్న వార్త మిగిలిన వేదన ఒక ఎత్తు అయితే.. కమలనాథుల ఆవేదన అంతా ఇంతా కాదు. రెండు సీట్లు ఉన్న స్థాయి నుంచి ఈ రోజున దేశంలో అత్యంత బలమైన పార్టీగా మారటం వెనుక వాజ్ పేయ్ వేసిన పునాదుల బలమేనన్న మాటను వారు చెబుతున్నారు.
వాజ్ పేయ్ పట్ల తమకున్న ప్రేమాభిమానాల్ని.. గౌరవాన్ని ప్రకటించేందుకు ఆయన్నుకడసారి చూసేందుకు పెద్ద ఎత్తున పోటెత్తారు. అంతిమ యాత్రకు భారీగా తరలివచ్చారు.ఇదంతా ఒక ఎత్తు అయితే.. వాజ్ పేయి మీద తనకున్న గౌరవాన్ని మోడీ ప్రదర్శించిన తీరు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్సిస్తోంది.
వాజ్ పేయి పార్థిప దేహాన్ని రాష్ట్రీయ స్మృతి స్థల్ కు తరలిస్తున్నప్పుడు ప్రధాని మోడీ ప్రోటోకాల్ ను పక్కన పెట్టేసి.. భద్రతాదళాలు వారిస్తున్నా.. వాజ్ పేయిను తరలిస్తున్న వాహనం వెనుకనే నడుచుకుంటూ ముందుకు సాగారు. ఆయన వెంటనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా ఉన్నారు. ఈ చర్యతోవాజ్ పేయి పై తనకున్న గౌరవ మర్యాదల్ని మోడీ ప్రకటించారని చెప్పక తప్పదు.