Begin typing your search above and press return to search.
కేంద్రం సవరణలు తిరస్కరించిన రైతు సంఘాలు
By: Tupaki Desk | 9 Dec 2020 2:00 PM GMTకేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలపై దేశవ్యాప్తంగా రైతులు తీవ్ర స్థాయిలో ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నిన్న చేపట్టిన భారత్ బంద్ విజయవంతం కావడంతో కేంద్రం ...ఆ చట్టాలకు కొన్ని సవరణలు ప్రతిపాదిస్తూ రైతులతో చర్చలు జరిపింది. 5 కీలకమైన సవరణలు చేస్తూ...వాటిని ఆమోదించాల్సిందిగా రైతులకు ప్రతిపాదించింది. సవరణలు అంగీకరించి ఆందోళనలు విరమించాలని కోరింది. ఈ నేపథ్యంలో ఆ సవరణల కోసం కేంద్రం తెచ్చిన ప్రతిపాదనలపై రైతు సంఘాలు సంచలన ప్రకటన చేశాయి. కేంద్రం ప్రతిపాదించిన సవరణలను తిరస్కరిస్తున్నట్లు ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతు సంఘాలు తేల్చి చెప్పాయి. సవరణల ప్రతిపాదనలపై చర్చించిన తర్వాత వాటిని ఏకగ్రీవంగా తిరస్కరిస్తున్నామని రైతు సంఘాలు బల్లగుద్ది చెప్పాయి.
కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలను కొనసాగించాలని రైతు సంఘాలు తీర్మానించాయి. కొత్త చట్టాలు రద్దు చేసేవరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని ప్రకటించాయి. ఈ క్రమంలోనే తమ ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని రైతు సంఘాల నేతలు ప్రకటించారు. డిసెంబ 14న దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శన చేపట్టాల్సిందిగా రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. డిసెంబరు 12 వరకు ఢిల్లీ-జైపూర్, ఢిల్లీ-ఆగ్రా జాతీయ రహదారిని దిగ్బంధిస్తామని రైతు సంఘాల నేతలు వెల్లడించారు. రైతు సంఘాలతో చర్చలు విఫలమైన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో.. వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ భేటీ అయ్యారు. రైతుల తాజా నిర్ణయం నేపథ్యంలో తదుపరి కార్యచరణపై వారిద్దరూ చర్చించనున్నారు.