Begin typing your search above and press return to search.
రైతు సమాధియత్నం.. ఇంతకంటే ఘోరం ఉంటుందా?
By: Tupaki Desk | 1 Oct 2019 8:45 AM GMTమూడేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టాదారు పుస్తకం ఇవ్వకపోవడంతో విసుగుచెందిన రైతు వినూత్న నిరసన తెలిపాడు. మహబూబాబాద్ కు చెందిన రైతు సుధాకర్ తనకు రైతుబంధు వస్తుందని.. తన భూమికి పట్టదారు పాసుపుస్తకం జారీ చేయాలని చాలా కాలంగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. ఎన్నో ఏళ్లుగా అధికారులు అలసత్వంతో ఇవ్వకపోవడంతో ఇక విసిగి వేసారి ఆందోళన బాట పట్టాడు.
మహబూబాబాద్ జిల్లా నరసింహుల పేట మండలం రామన్నగూడెంకు చెందిన రైతు అధికారుల తీరుపై నిరసనగా పీకల లోతు గొయ్యి తవ్వుకొని ఆ గోతిలో తనకు తానే పూడ్చుకొని నిరసన తెలిపారు. తన వ్యవసాయ భూమిలోనే ఆరడుగల మేర గోతిని తనకు తానే పూడ్చుకొని ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన 4.39 ఎకరాల భూమికి పట్టదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని రైతు సుధాకర్ ఈ నిరసన తెలిపారు.
విషయం తెలియగానే తహసీల్దార్ మాధవి అలెర్ట్ అయ్యారు. వెంటనే విషయం బయటకు పొక్కకుండా ఉండాలని రైతు సుధాకర్ కు పాసుబుక్ ను అందించినట్టు తెలిసింది.
అయినా ఇంత లేట్ గా స్పందించారని రైతులు ఆందోళన చేశారు. సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పినా రెవెన్యూశాఖ అధికారుల తీరు మాత్రం మారడం లేదని ధ్వజమెత్తారు. ఇలా రెవెన్యూశాఖలో లీలలు బయటపడుతున్నాయి. కేసీఆర్ ఈ రెవెన్యూశాఖ ప్రక్షాళనకు నడుం బిగించిన వేళ ఇలాంటి ఘటనలు ఆయన చర్యకు మద్దతుగా నిలుస్తున్నాయి.

వీడియో కోసం క్లిక్ చేయండి 1