Begin typing your search above and press return to search.
సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో మరో రైతు ఆత్మహత్య
By: Tupaki Desk | 3 Jan 2021 8:40 AM GMTకేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు రైతులను బలిమీటమెక్కిస్తున్నాయి. వరుసగా రైతుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. వణికించే చలిలోనూ ఢిల్లీలో అన్నదాతలు ఆందోళన విరమించడం లేదు.
తాజాగా మరో రైతు గుండె ఈ ఆందోళనల్లో ఆగిపోయింది. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ 75 ఏళ్ల వృద్ధ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లోని ఘాజీపూర్ వద్ద రైతులు నిరసన తెలియజేస్తున్న ప్రదేశంలోనే ఆ రైతు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదం నింపింది.
ఘజియాబాద్ లో రైతులు నిరసన తెలియజేస్తున్న ప్రదేశానికి సమీపంలోని టాయిలెట్ లో కాశ్మీర్ సింగ్ అనే వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఈ వ్యక్తిని ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ జిల్లాకు చెందిన వాడిగా గుర్తించామన్నారు.
‘‘ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్ -హర్యానా రాష్ట్రాల్లో ఇప్పటివరకూ 50 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కానీ ఉత్తరప్రదేశ్ - ఉత్తరాఖండ్ లో మాత్రం ఇంతవరకూ ఎవరూ ప్రాణ త్యాగం చేయలేదు. అందుకే ఈ చట్టాలను వ్యతిరేకించేందుకు నేను నా ప్రాణాన్ని త్యాగం చేస్తున్నాను..’’ అని కాశ్మీర్ సింగ్(75) సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు.
ఈ ఆందోళనలు జరుగుతున్న ప్రదేశంలో ఇప్పటివరకు ఆత్మహత్యలకు పాల్పడిన వారి సంఖ్య మూడుకు చేరింది. రైతు ఉద్యమానికి తన ప్రాణాన్ని బలి ఇస్తున్నానని.. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలతో రైతులకు మేలు జరగదని సూసైడ్ నోట్ లో ఆ రైతు పేర్కొనడం సంచలనంగా మారింది.