Begin typing your search above and press return to search.

ఆ రైతుకు 854 ఎక‌రాలు.. అత‌నెక్క‌డుంటారంటే?

By:  Tupaki Desk   |   7 April 2018 4:45 AM GMT
ఆ రైతుకు 854 ఎక‌రాలు.. అత‌నెక్క‌డుంటారంటే?
X
ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా 854 ఎక‌రాలు ఒకే వ్య‌క్తికి ఉన్న వైనం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. అన్న‌దాత‌ల్ని ఆదుకునేందుకు వీలుగా.. దేశంలో మ‌రెక్క‌డా లేని రీతిలో రైతుల‌కు పెట్టుబ‌డి సాయం అందించే దిశ‌గా త‌మ రైతుబంధు ప‌థ‌కం ఉంద‌ని తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

ఈ ప‌థ‌కం అమలు కోసం.. రాష్ట్ర వ్యాప్తంగా ఏ రైతుకు ఎన్ని ఎక‌రాల వ్య‌వ‌సాయ భూమి ఉంద‌న్న అంశంపై జాబితాను రూపొందించారు. ఇందులో భాగంగా ఆస‌క్తిక‌ర అంశం ఒక‌టి తెర‌పైకి వ‌చ్చింది. భూపాల‌ప‌ల్లి జిల్లాకు చెందిన ఒక రైతుకు వ్య‌వ‌సాయ భూమి కింద ఏకంగా 854 ఎక‌రాలు ఉండ‌టంపై అధికారులు విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు.

మిగిలిన రైతుల మాదిరే ఈ రైతుకు సైతం వ్య‌వ‌సాయ బంధు ప‌థ‌కం కింద ఖ‌రీఫ్ లో రూ.34.16 ల‌క్ష‌లు.. ర‌బీలో మ‌రో రూ.34.16 ల‌క్ష‌లు చెల్లించాల్సి ఉంటుంది. ఇన్నేసి వంద‌ల ఎక‌రాలు ఉన్న అసామికి ఇంత పెద్ద మొత్తంగా పంట సాయాన్ని ఇవ్వాల్సి రావ‌టం ఎలా అన్న‌ది ఇప్పుడు సందేహంగా మారింది. నిజంగానే ఒక రైతుకు అంత భారీగా భూమి ఉందా? లేక‌.. ఏదైనా పొర‌పాటు జ‌రిగిందా? అన్న ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ విష‌యాన్ని తేల్చేందుకు అధికారులు స‌ద‌రు రైతుకు సంబంధించిన స‌ర్వే నెంబ‌ర్లు తిర‌గేశారు. అయితే.. ఆ రైతుకు 854 ఎక‌రాల ప‌ట్టాభూమి ఉన్న విష‌యం తేలింది.

ప్ర‌స్తుతానికైతే ఆ రైతుకు రైతుబంధు ప‌థ‌కం కింద సాయాన్ని ఇవ్వ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించిన‌ట్లుగా తెలుస్తోంది. స‌ద‌రు రైతుకు పెట్టుబ‌డి సాయం ఇచ్చే అంశాన్ని ప్ర‌భుత్వ విచ‌క్ష‌ణ‌కే వ‌దిలేయ‌టం గ‌మ‌నార్హం. ఇంత‌కూ ఈ విష‌యం ఎలా బ‌య‌ట‌కు వ‌చ్చింద‌న్న‌ది చూస్తే.. రైతుబంధు ప‌థ‌కం కింద పెట్టుబ‌డి సొమ్మును అంద‌జేసేందుకు వ్య‌వ‌సాయ శాఖ క‌స‌ర‌త్తు చేస్తోంది. ఈ నేప‌థ్యంలో భూ ప్రక్షాళ‌న రికార్డుల స‌మాచారాన్ని రెవెన్యూ శాఖ ఇటీవ‌ల వ్య‌వ‌సాయ శాఖ‌కు అంద‌జేసింది. త‌మ‌కు వ‌చ్చిన స‌మాచారంతో రైతు వివ‌రాలు.. వారికున్న భూముల లెక్క‌ల్ని ప‌రిశీలించి తుది జాబితాను సిద్ధం చేసే ప‌నిలో ప‌డ్డారు. ఈ స‌మ‌యంలోనే వంద‌లాది ఎక‌రాలున్న అసామి లెక్క బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇది అధికార వ‌ర్గాల్లో సంచ‌ల‌నంగా మారింది.

ఆస‌క్తిక‌ర‌మైన మ‌రో అంశం ఏమిటంటే వ్య‌క్తిగ‌తంగా ఒక వ్య‌క్తికి 50 ఎక‌రాల కంటే ఎక్కువ వ్య‌వ‌సాయ భూమి ఉండ‌కూడ‌దు భూసీలింగ్ చ‌ట్టం కింద ఉన్న నిబంధ‌న‌కు సంబంధం లేకుండా ఇన్నేసి వంద‌ల ఎక‌రాలు భూమి ఉండ‌టంపై విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రో విష‌యం ఏమిటంటే.. చాలామంది నేత‌ల‌కు సీలింగ్ గా ఉన్న 50 ఎక‌రాల కంటే ఎక్కువ భూమి ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. మ‌రి.. వీరంద‌రికి పెట్టుబ‌డి సాయాన్ని అందివ్వాలా? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. అయితే.. భారీగా భూమి ఉన్న వారు త‌మ‌కు ప్ర‌భుత్వం ఇచ్చే సాయం అక్క‌ర్లేద‌న్న మాటను చెబుతున్నారు. ఇందులో భాగంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌కున్న 37 ఎక‌రాల వ్య‌వ‌సాయ భూమికి ప్ర‌భుత్వం నుంచి సాయం తీసుకోన‌ని ప్ర‌క‌టించారు. ఆయ‌న బాట‌లో ప‌లువురు న‌డిచే అవ‌కాశం ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. ఏమైనా ఒక రైతు ద‌గ్గ‌ర 854 ఎక‌రాల వ్య‌వ‌సాయ భూమి ఉండ‌టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.