Begin typing your search above and press return to search.
కరోనా ఎఫెక్ట్: మేకలకూ మాస్క్ లొచ్చాయి
By: Tupaki Desk | 10 April 2020 2:00 PM GMTకలికాలం మరీ.. జంతువుల నుంచి మనుషులకు.. మనుషుల నుంచి జంతువులకు కరోనా వ్యాపిస్తూనే ఉంది. చైనాలోని వూహాన్ లో గబ్బిలం నుంచి పుట్టిందని భావిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు మనషులకు అంటి ప్రపంచవ్యాప్తంగా మరణ మృదంగం వినిపిస్తోంది. లక్షలమందికి సోకి వేలమందిని బలితీసుకుంటోంది. దీని ధాటికి అమెరికాలోని న్యూయార్క్ లో గల ఓ జూలో పులికి కరోనా సోకిందనే వార్త జనంలో చర్చనీయాంశమైంది.
మనుషుల నుంచి జంతువులకు కరోనా వ్యాపిస్తుందని పులికి సోకడంతో తేటతెల్లమైంది. ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి తన మేకల మందను కరోనా నుంచి రక్షించుకోవడానికి ఒక వింత ఐడియాను ఫాలో అయ్యాడు.
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ గ్రామం ఎన్టీఆర్ కాలనీకి చెందిన వెంకటేశ్వరరావు కొంత కాలంగా మేకలను పెంచుకుంటున్నాడు. వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఆదాయం సంపాదిస్తున్నాడు. పులికి కరోనా సోకడంతో భయపడ్డ వెంకటేశ్వరరావు తన మేకలకు సోకితే తన ఆదాయం పడిపోతుందని.. తనకు ప్రాణహాని అని గ్రహించి ఏకంగా మందలోని మేకలన్నింటి మూతికి మాస్కులు కట్టేశాడు. ఇంటి నుంచి మాస్కులతో వెళుతున్న మేకలు మైదానంలోని గడ్డి ఉన్న ప్రాంతానికి వెళ్లాక మేయడం కోసం వాటి మాస్కులు తీస్తున్నాడు..
అవి మేశాక మళ్లీ ఇంటికి మాస్కులు కట్టి తీసుకొస్తున్నాడు. కరోనా వ్యాపించకుండా మేకలకు మాస్కులు కట్టిన ఆ యజమాని ఆలోచనను చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ చిత్రాలను సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యాయి.