Begin typing your search above and press return to search.
జనసైనికుల మాట!..జగన్ సీఎం కావాల్సిందే!
By: Tupaki Desk | 26 Feb 2019 4:19 AM GMTఅది జనసేన సభ. జనసేనాని పవన్ కల్యాణ్ హాజరైన సభ. అయితేనేం...ఆ సభకు హాజరైన వారు పవన్ ను సీఎంగా చూడటం కంటే కూడా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డినే సీఎంగా చూడాలని కోరుకున్నారు. అది కూడా ఎక్కడో సభా వేదికకు అల్లంత దూరంలో ఉండి నినదించలేదు. సభా వేదికను ఎక్కి... పవన్ పట్టుకున్న మైకు ద్వారా ఈ కోరిక వినిపించారు. నిజమా? అంటే... నిజ్జంగా నిజమే. పవన్ ముందే... తనకు జగన్ సీఎం కావాలని ఉందని - ఇక్కడికి వచ్చిన వారంతా జగన్ ను గెలిపించాలని - అప్పుడు రాష్ట్రంలోని వర్గాల వారికి న్యాయం జరుగుతుందని ఓ రైతు తన మనసులోని మాటను చాలా గట్టిగానే వినిపించారు. తన ముందే తన ప్రత్యర్థిని సీఎం కావాలంటూ చెబుతుంటే... ఇతర నేతలేం చేస్తారు? మైకు లాగేసుకుంటారు? టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అయితే ఈ తరహా వ్యాఖ్యలను ఎంతమాత్రం సహించరు. మైకును లాగేస్తారు. లేదంటే అధికారుల చేతనే మైకును లాగించేస్తారు.
ఇక్కడ మాత్రం అందుకు భిన్నమైన సీన్ కనిపించింది. తన ప్రత్యర్థి సీఎం కావాలంటూ తన సభకు వచ్చిన ఓ రైతు నిర్భయంగా చెబుతూ ఉంటే... అసహనానికి గురి కాకుండా పవన్ చాలా హుందాగా వ్యవహరించారు. జనం మాటను నొక్కేయకుండా... వారు నిర్భయంగా తమ మనసులోని మాటను చెప్పే స్వేచ్ఛను కలిపించారు. ఇది నిన్న కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగిన జనసేన బహిరంగ సభలో చోటుచేసుకున్న ఆసక్తికర సన్నివేశం. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ ఘటనలో ఏం జరిగిందన్న విషయానికి వస్తే... తన సభకు వచ్చిన వివిధ వర్గాల వారికి వారి వారి అభిప్రాయాలు చెప్పేందుకు పవన్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా పవన్ ఆహ్వానం మేరకు వేదిక ఎక్కిన ఓ రైతు... రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో జరుగుతున్న అన్యాయంపై గళం ఎత్తారు.
*రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు. వ్యవసాయం లేదు. అసలు జగన్ మోహన్ రెడ్డిని గానీ గెలిపిస్తే మీరు... ఆయన ద్వారా అన్నీ సాధించుకుంటాం. నేనే సాధించుకుని వస్తాను* అంటూ ఆ రైతు తనదైన శైలిలో కాస్తంత భావోద్వేగంతో కూడిన స్వరంతో చెప్పారు. ఈ సందర్భంగా సదరు రైతు చేతిలోని మైకును తన చేతిలోకి తీసుకున్న పవన్... ఆ మైకును రైతు నోటి వద్దే ఉంచి - ఆయన చెబుతున్న మాటలన్నీ సభకు వచ్చిన వారందరికీ వినిపించేలా సహకరించారు. ఈ సందర్భంగా తన రాజకీయ ప్రత్యర్థిపై తన సభకు వచ్చిన రైతు ప్రశంసలు కురిపిస్తూ... జగనే సీఎం కావాలని చెబుతున్నా... పవన్ ముఖంలో ఎలాంటి మార్పు రాలేదు. నవ్వుతూనే ఆ రైతు వాదనను సావధానంగా వినడంతో పాటు రైతు వాయిస్ ను మిగిలిన వారికీ వినపడేలా చేశారు. ఈ సందర్భంగా పవన్ నోట చిరునవ్వు ఏమాత్రం చెరిగిపోలేదు. మొత్తంగా తన సభా వేదికపై ప్రత్యర్థి గెలవాలన్న మాట వినిపించినా కూడా... పవన్ చాలా హుందాగానే వ్యవహరించారని చెప్పాలి.