Begin typing your search above and press return to search.
ఉరి వేసుకొని రైతు ఆత్మహత్య ... శవం దించకుండానే ఫోటో దిగిన ఎమ్మెల్యే !
By: Tupaki Desk | 10 April 2020 7:10 AM GMTరాజకీయ నాయకులు ... దేనైనా కూడా తమకి అనుకూలంగా మార్చుకోవాలని చూస్తుంటారు. ఏ విషయాన్ని అయిన కూడా తమకి అనుకూలంగా మార్చుకోవడంలో రాజకీయ నేతల తరువాతే ఎవరైనా కూడా. చేసే ప్రతి పనిలో నిజాయితి ఉంటుందో లేదో చెప్పలేము కానీ , పబ్లిసిటీ మాత్రం హై లెవెల్ లో ఉండేలా చూసుకుంటారు. సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తరువాత ఈ పిచ్చి మరింత పెరిగిపోతుంది. ఈ మధ్య కాలంలో ప్రతి రాజకీయ నాయకుడు ..నాయకురాలు కూడా సొంతంగా సోషల్ మీడియా టీం నే మెయిన్ టైన్ చేస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ పిచ్చి ఎంతలా ఉందొ.
తాజాగా జరిగిన ఒక సంఘటన గురించి తెలుసుకుంటే .. ఆ పిచ్చి ఎంతకీ చేరిందో అర్థం చేసుకోవచ్చు. కర్ణాటక లోని శిర తాలూకా దేవరహళ్లి గ్రామానికి చెందిన రైతు గంగాధర్ అప్పుల భాద తాళలేక చెట్టుకి ఉరి వేసుకొని చనిపోయాడు. పొలం పనులకోసం రూ.4.50 లక్షల వరకూ అప్పు చేశాడు. పంటలు పండక అప్పులు తీర్చే మార్గం లేక, బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకొని రైతు మృతదేహం చెట్టుకు వేలాడుతుండగానే ఫోటోలకు పోజులిచ్చాడు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం తో ప్రజలు ఆ ఎమ్మెల్యే పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పుల భాదతో చనిపోయిన ఆ రైతు శవాన్ని కూడా కిందకి కూడా దించకుండా, అలాగే చెట్టుకి మృతదేహం వ్రేలాడుతుండగానే ఫోటో తీయించుకున్న ఎమ్మెల్యేపై ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు