Begin typing your search above and press return to search.
రైతు ఉద్యమంతో ‘జియో’కు కొత్త ఆందోళన
By: Tupaki Desk | 28 Dec 2020 6:15 AM GMTవినూత్న చర్యలతో దేశ ప్రజలందరి మన్ననలు పొందుతున్న రైతు ఉద్యమం విధ్వంస కాండ వైపు మరలినట్లు వస్తున్న వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకొచ్చిన మూడు సాగు చట్టాల కారణంగా అంతిమంగా లాభం పొందేది అంబానీ.. ఆదానీ అన్న వాదన కొన్నిరోజులుగా సాగుతున్న సంగతి తెలిసిందే. నాలుగు నెలలుగా వివిధ రూపాల్లో నిరసన చేపట్టిన రైతులు.. గడిచిన నాలుగు వారాలకు పైనే.. వణికించే చలిలో దేశ రాజధాని ఢిల్లీకి శివారులో ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. రాత్రి.. పగలు అన్న తేడా లేకుండా సాగుతున్న ఈ ఉద్యమం కేంద్రాన్ని వణుకు పుట్టిస్తోంది. ఇప్పటికే పలు దశల్లో చర్చలు జరిగినా.. అవేమీ ఫలవంతం కాలేదు.
ఇదిలా ఉంటే.. రైతు ఉద్యమం పేరుతొ సాగుతున్న కొత్త ఆందోళన.. రిలయన్స్ జియోకు భారీగా నష్టపోయేలా చేస్తోంది.. గడిచిన కొద్దిరోజులుగా పంజాబ్ లోని పలు ప్రాంతాల్లో జియో సెల్ టవర్లను కొందరు ఆందోళనకారులు టార్గెట్ చేసి ధ్వంసం చేస్తున్నారు. ఆప్టికల్ కేబుల్ వైర్లను కత్తిరించివేయటం.. సెల్ టవర్లను ధ్వంసం చేయటం లాంటివి జోరుగా సాగుతున్నాయి. దీంతో.. జియోకు భారీ నష్టం వాటిల్లుతోంది. ఇప్పటివరకు సాగిన విధ్వంసం కారణంగా వందల కోట్ల నష్టం వాటిల్లినట్లుగా చెబుతున్నారు. ఒక్కరోజులో 200 పైచిలుకు చోట్ల నెట్ వర్కును ధ్వంసం చేయటంతో కనెక్టివీ తెగిపోవటమే కాదు.. ఈ ప్రాంతాల్లో జరిగిన విధ్వంసంతో తమకు రూ.40 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లుగా జియో పేర్కొంది.
ఈ లెక్కన ఇప్పటివరకు దాదాపు 1400 ప్రాంతాల్లో సాగిన విధ్వంసంతో వందల కోట్ల నష్టం వాటిల్లినట్లుగా తెలుస్తోంది. గమనించాల్సిన అంశం ఏమంటే.. రైతుల పేరుతో కొందరు వ్యక్తులు తమ సెల్ టవర్లను టార్గెట్ చేస్తున్నారని.. వాటికి తగిన భద్రత ఇవ్వాలని డిసెంబరు 23న పంజాబ్ డీజీపీకి జియో లేఖ రాసింది. వెంటనే స్పందించిన ఆయన.. పోలీసులను అలెర్టు చేశారు. కానీ.. ఇప్పటివరకు 1400 వరకు సెల్ టవర్లు ధ్వంసమైనా.. వార్తల్లోకి మాత్రం దీని గురించి రాలేదు. లేఖ రాసిన ఐదారు రోజుల తర్వాత.. అది కూడా వందలాది సెల్ టవర్లకు నష్టం వాటిల్లిన తర్వాతే పెద్ద ఎత్తున వార్తలు రావటం గమనార్హం. తాజా పరిణామాలు రిలయన్స్ కు భారీ షాకింగ్ గా మారినట్లుగా చెప్పక తప్పదు. మరి.. దీనిపై పంజాబ్ రాష్ట్ర సర్కారు.. కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ప్రశ్నగా మారింది.