Begin typing your search above and press return to search.
రైతులు ప్రభుత్వాన్ని ఢీకొంటే ఇలా ఉంటది
By: Tupaki Desk | 29 Nov 2019 7:40 AM GMTమన దేశంలో బహిరంగ మార్కెట్లో ఉల్లి ధర కిలోకు వంద దాటుతోంది.. కానీ పండించిన రైతుకు మాత్రం కిలోకు రూ.25-రూ.30కే అందుతోంది. ఇలా దళారీలతో రైతులను దోచేస్తున్న వైనం భారతదేశంలో చూశాం. ఇక అతివృష్టి, అనావృష్టి వస్తే భారత దేశంలో ఉసురు తీసుకునే రైతులనే ఎక్కువగా చూశాం. పంట నష్టపోయి పురుగుల మందులు తాగి చేనుల్లోనే ఆత్మహత్యకు పాల్పడే ఘటనలు మన దేశంలో కోకొల్లలు. కానీ ఫ్రాన్స్ దేశంలో రైతులు అలా కాదు.. ఏకంగా దేశ ప్రభుత్వాన్నే షేక్ చేసేలా నిరసన తెలిపారు.
తమ సమస్యలను పరిష్కరించాలని కోరినా ఫ్రాన్స్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో చిర్రెత్తుకొచ్చిన ఫ్రాన్స్ రైతులు ఏకంగా ప్రభుత్వంపైకి దండెత్తారు. ఫ్రాన్స్ దేశ రాజధాని పారిస్ కు వేలాది ట్రాక్టర్లతో తరలివచ్చి నిరసన తెలిపారు.
దాదాపు 50వేల ట్రాక్టర్లతో ఫ్రాన్స్ లోకి ప్రవేశించి రోడ్లన్నింటిని దిగ్భంధనం చేశారు. రోడ్లన్నీ ట్రాక్టర్లతో నిండిపోయాయి. ట్రాఫిక్ స్తంబించిపోయింది. సమస్యలు పరిష్కరించేవరకు తమ నిరసన తెలుపుతామని భీష్మించుకోవడంతో దెబ్బకు ఫ్రాన్స్ ప్రభుత్వం దిగి వచ్చి రైతుల సమస్యలను పరిష్కరించింది.
ఇలా ఫ్రాన్స్ దేశంలో రైతులు చేసిన నిరసన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులకు స్ఫూర్తిదాయకంగా మారింది. మన రైతులు కూడా ఈ కొత్త నిరసన ఒరవడిని నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.