Begin typing your search above and press return to search.
రైతు వెన్నుముక విరిచిన అధికారుల బలుపు
By: Tupaki Desk | 5 Feb 2017 9:56 AM GMTఅధికారం చేతిలో ఉంటే సామాన్యుడి కష్టం అస్సలు కనిపించదు. పెద్దోళ్ల కోసం రూల్స్ ను మార్చేసే అధికారగణం సామాన్యుడి గోడును అస్సలు పట్టించుకోదు. ఒకవేళ అధికారుల తీరుపై నిరసన ప్రదర్శించే ప్రయత్నం చేస్తే.. ఎంత కర్కసంగా వ్యవహరిస్తారన్న విషయం కళ్లకు కట్టేలా చేసిన ఉదంతమిది. తమ జీవనాధారమైన సాగుభూమి దక్కకుండా పోతున్న వేళ.. ఏపీకి చెందిన అన్నదాత చేసిన పోరాటానికి కర్ణాటకకు చెందిన అధికారులు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో ఈ ఉదంతం తెలుసుకుంటే అర్థమవుతుంది.
అనంతపురం జిల్లాకు మడకశిర లోని మెళవాయి ప్రాంతం కర్ణాటక సరిహద్దులకు అత్యంత సమీపంగా ఉంటుంది. ఈ గ్రామంలో కర్ణాటకకు చెందిన విద్యుత్ అధికారులు విద్యుత్ టవర్లు నిర్మిస్తున్నారు. కర్ణాటకలోని మధుగిరి నుంచి పావగడ వరకూ కేపీటీసీఎల్ 220 కేవీ హైపవర్ విద్యుత్ తీగల్ని వేస్తున్నారు. తమ పొలం మీదుగా వెళుతున్న తీగల కారణంగా జరిగే నష్టపరిహారాన్ని అందించాలని సుబహాన్ సాబ్ కోరుతున్నారు. ఇప్పటికే పలుమార్లు డిమాండ్ చేసినా అధికారులు పట్టించుకోలేదు.
తాజాగా తమ పొలంలో అధికారులు విద్యుత్ వైర్లను లాగుతున్న వేళ.. తమకు నష్టపరిహారం ఇవ్వని అధికారుల తీరును నిరసిస్తూ.. భూమి యజమాని సుబహాన్ సాబ్.. అతని కుమారులు వినూత్న రీతిలో నిరసన తెలిపే ప్రయత్నం చేశారు. విద్యుత్ తీగల్ని లాగుతున్న సమయంలో తీగల్ని పట్టుకొని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రొక్లయినర్ల సాయంతో విద్యుత్ తీగల్ని పైకి లాగుతున్న వేళ.. విద్యుత్ తీగల్ని పట్టుకొని తండ్రీ కొడుకులిద్దరిని పట్టించుకోకుండా పైకి లాగేశారు. కొద్దిదూరం వెళ్లాక చేజారి సుబహాన్ సాబ్ ఎత్తు మీద నుంచి కిందకు దూకేశాడు.
అయినప్పటికీ విద్యుత్ అధికారులు తమ ప్రయత్నాన్ని ఆపలేదు. విద్యుత్ తీగను పట్టుకొని పైకి వేలాడుతున్న సుబహాన్ కొడుకును పట్టించుకోని అధికారులు విద్యుత్ వైర్లను భారీగా పైకి లాగారు. వైర్లు వదిలేస్తే.. ప్రాణం పోతుందన్న భయంతో.. అలానే పట్టుకొని పావుగంట వేలాడినా అధికారులు కనికరించలేదు. ఇక.. ఓపిక లేక.. సుబహాన్ కొడుకు నబీరసూల్ ఎక్కువ ఎత్తు నుంచి దూకేశాడు. దీంతో.. అతడి వెన్నుముక విరిగింది. అతడ్నిహిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కర్ణాటక విద్యుత్ అధికారుల తీరుపై స్థానికులు.. ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఉదంతంపై మంత్రి పల్లె రియాక్ట్ అవుతూ.. కర్ణాటక ప్రభుత్వం నుంచి బాధితుడికి నష్టపరిహారం వచ్చేలా చేస్తామని ప్రకటించారు. అదేదో.. ఇలాంటిది జరగకముందే చేసి ఉంటే.. అసలీ పరిస్థితే చోటు చేసుకునేది కాదు కదా? అయినా.. ఏపీలోకి వచ్చి కర్ణాటక అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటే.. ఏపీ విద్యుత్ అధికారులు ఏం చేస్తున్నట్లు..? తాజా ఉదంతాన్ని చూస్తే.. సామాన్యుడి కష్టాలు అధికారులకు పట్టవా? అన్న సందేహం కలగక మానదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/