Begin typing your search above and press return to search.
50 వేలలోపు రైతు రుణాలు మార్చిలోపు మాఫీ.. బడ్జెట్
By: Tupaki Desk | 7 March 2022 12:30 PM GMTతెలంగాణ రైతుల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడే సర్కార్ ఈ మార్చిలోపు రూ.50వేల లోపు రైతు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించింది. 2022-23లో పంట రుణాల కోసం రూ.16,144 కోట్లు ప్రతిపాదించా రు. ఈ దఫాలో 5.12 లక్షల మంది రైతుల రుణాలు మాఫీ చేయనున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు.
ఈ ఏడాది బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి రూ.24వేల 254 కోట్లు ప్రతిపాదించారు. ఆయిల్ పామ్ సాగుపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోన్న సర్కార్.. పామాయిల్ సాగుకు వెయ్యి కోట్లు కేటాయించారు.
రైతు మెడకు చుట్టుకున్న అప్పుల ఉరిని తొలగించడానికి రాష్ట్ర సర్కార్ రైతు రుణమాఫీ పథకాన్ని ప్రవేశపెట్టింది. రూ.లక్ష వరకు రుణాన్ని మాఫీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు రూ.25 వేలు, రూ.50 వేలు ఉన్నవారిలో కొందరికే మాఫీ జరిగింది. రుణమాఫీ అంశంపై రైతులకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు గుడ్‌న్యూస్ చెప్పారు. రూ.50వేల లోపు రైతు రుణాలు మార్చిలోపు మాఫీ చేస్తామని ప్రకటించారు.
వచ్చే ఆర్థిక ఏడాది రూ.75 వేల లోపు సాగు రుణాలు మాఫీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది రూ.16,144 కోట్లను పంట రుణాల కోసం కేటాయించారు. రాష్ట్రంలో ఈ దఫాలో 5.12 లక్షల మంది రైతుల రుణాలు మాఫీ చేయనున్నట్లు హరీశ్ రావు తెలిపారు. వ్యవసాయ రంగానికి గత ఏడేళ్లుగా ప్రభుత్వం పెద్ద ఎత్తున బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తోంది. ఎనిమిది వ్యవసాయ సీజన్లలో రైతు బంధు పథకం కింద 50,448 కోట్ల రూపాయలను 63 లక్షల మంది రైతుల ఖాతాలో ప్రభుత్వం జమచేసింది.
రైతు భీమా పథకం ద్వారా రైతు మరణిస్తే వారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నామని హరీశ్ రావు తెలిపారు. ఇప్పటి వరకు 75 వేల కుటుంబాలకు 3,775 కోట్ల రూపాయలను ప్రభుత్వం అందజేసినట్లు వెల్లడించారు.
రైతుల అభివృద్ధికి, సంక్షేమానికి పెద్దపీట వేసే తెలంగాణ సర్కార్ గతేడాది కంటే ఈ ఏడాది వ్యవసాయ రంగ బడ్జెట్‌ను తగ్గించింది. గతేడాది రూ.25వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈ ఏడాది(2022-23)కి రూ.24,254 కోట్లు ప్రతిపాదించింది.
రాష్ట్రంలో పామాయిల్ సాగుకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు. పామాయిల్ సాగుకు ఈ పద్దులో రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో 2.5 లక్షల ఎకరాల్లో అయిల్ పామ్ సాగుచేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు చెప్పారు. దేశంలో ఇంత పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తోన్న రాష్ట్రం తెలంగాణ తప్ప మరొకటి లేదని స్పష్టం చేశారు.