Begin typing your search above and press return to search.
బాబు ఇంటి చుట్టూ 3 కిలోమీటర్ల వరకూ బారికేడ్లు..?
By: Tupaki Desk | 20 Jun 2019 4:57 AM GMTకీలక నేతలు.. అత్యుత్తమ స్థానాల్లో ఉన్న వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. తమ కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్త పడాలి. అప్పుడే వారి మనసుల్ని దోచుకునే అవకాశం ఉంటుంది. పవర్ చేతిలో ఉన్నప్పుడు సైతం సాదాసీదాగా ఉండే ముఖ్యమంత్రులు దేశంలో చాలామందే ఉన్నారు. అలాంటిది సీఎం పదవి పోయిన తర్వాత కూడా హంగు.. ఆర్భాటాలతో హడావుడి చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు తీరుపై అమరావతి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కొంతమంది రైతులు.. మత్స్యకారులు తాజాగా మంళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని కలిశారు. వారు తమ సమస్యను ఏకరువు పెట్టుకున్నారు. వారు చెప్పిన విషయాలకు ఆళ్ల ఆశ్చర్యపోయిన పరిస్థితి. ఇంతకీ వారు ఫిర్యాదు చేసింది ఎవరి మీదనో తెలుసా? టీడీపీ అధినేత చంద్రబాబు మీద.
చంద్రబాబు హంగు.. ఆర్భాటం తమకు ఇబ్బందిగా మారుతుందని వారు వాపోతున్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లు బాబు తీరుతో గొంతు విప్పలేకపోయిన వారు ఇప్పుడు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.బాబు నివాసం ఉన్న కరకట్ట ప్రాంతంలో బాబు భద్రతా సిబ్బంది చేస్తున్న హడావుడికి స్థానికులకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది.
చుట్టూ పొలాల మధ్యన బాబు నివాసం ఉంది. వాస్తవానికి కరకట్ట వద్ద ఎలాంటి నిర్మాణాలకు అవకాశం లేకున్నా.. నిబంధనలకు విరుద్ధంగా బాబు ఉంటున్న ఇంటిని నిర్మించినట్లుగా ఆరోపణ ఉంది. దీనిపై జగన్ ప్రభుత్వం దృష్టి పెట్టింది కూడా. ఇదిలా ఉంటే.. బాబు ఉంటున్న ఇంటి చుట్టూ మూడు కిలోమీటర్ల మేర బారికేడ్లు పెట్టిన భద్రతా సిబ్బంది రైతుల్ని.. మత్స్యకారుల్ని అటువైపునకు పోకుండా అడ్డుకుంటున్నారు.
దీంతో తమ గుర్తింపు కార్డులు చూపించి పొలాల్లోకి నదిలోకి వెళ్లాల్సి వస్తోంది. ఈ తిప్పలు బాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తప్పలేదు.. అధికారం పోయి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడానా? అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. వారి ఆవేదనను విన్న ఆళ్ల స్పందించి.. బాబు నివాసం చుట్టూ మూడు కిలోమీటర్ల వరకూ ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించకుంటే తానే స్వయంగా ఇంటి ముందు ధర్నా చేస్తానని చెప్పినట్లుగా తెలుస్తోంది. అధికారం పోయిన తర్వాత ఎంత సాదాసీదాగా ఉంటే అంత మంచిది. అనవసరమైన హడావుడితో తలనొప్పులు తప్పవు. ఈ విషయం బాబుకు ఎప్పుడు అర్థమవుతుందో?