Begin typing your search above and press return to search.

జగన్ ప్రయత్నానికి రైతుల అడ్డంకులు

By:  Tupaki Desk   |   28 March 2021 6:30 AM GMT
జగన్ ప్రయత్నానికి రైతుల అడ్డంకులు
X
మూడు రాజధానుల జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదనను అమరావతి రైతులు అడ్డుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. రాజధాని అమరావతి నుండి విశాఖపట్నంకు తరలి వెళ్ళకుండా అడ్డుకోవాలంటే న్యాయస్ధానాన్ని ఆశ్రయించటం ఒకటే మార్గమని కొందరు రైతులకు బాగా అర్ధమైంది. అయితే ఇప్పటికే జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తు కొందరు వేసిన కేసులను హైకోర్టు విచారిస్తున్న విషయం తెలిసిందే.

మరి వీరి కేసుల విషయంలో కానీ లేకపోతే వాళ్ళ తరపున జరుగుతున్న వాదనల విషయంలో కానీ రైతులకు ఏమన్నా అనుమానం మొదలైందేమో. అందుకనే రైతుల్లో కొందరు వ్యక్తిగతంగా కోర్టులో పిటీషన్లు వేయాలని డిసైడ్ అయ్యారు. అంటే రైతులే ఎవరికి వారుగా విడివిడిగా జగన్ నిర్ణయాన్ని సవాలు చేస్తు పిటీషన్లు వేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ నిర్ణయంతో తమకు జరిగిన నష్టాన్ని వివరిస్తు ఏప్రిల్ 15వ తేదీలోగా కేసులు దాఖలు చేయాలని అమరావతి రైతులు డిసైడ్ అయ్యారు.

రైతులు తీసుకున్న నిర్ణయంతోనే వీళ్ళ ఆలోచన ఏమిటో అర్ధమైపోతోంది. ఎంత వీలైతే అంత రాజధానిని తరలించకుండా అడ్డుకోవటం కోసమే కోర్టుల్లో వ్యక్తిగతంగా వీలైనంతమంది కేసులు వేయాలని అనుకున్నారు. అయితే రైతులు మరచిపోయిన విషయం ఒకటుంది. ఎంతమంది రైతులు కోర్టులో విడివిడిగా కేసులు వేసినా పెద్దగా ఉపయోగం ఉండదు. ఎందుకంటే రైతులు ఎంతమంది కోర్టులో కేసులు వేసినా మొత్తం విషయం ఒకటే కాబట్టి అన్ని కేసులను ఒకటిగానే పరిగణించి కోర్టు విచారిస్తుంది.

అయితే రాజధాని తరలింపు కేంద్రంగానే రైతులు కేసులు వేయాలని డిసైడ్ అయినా ప్రతి పిటీషన్లోను ఏదో ఒక కొత్త పాయింట్ ఉండేట్లుగా చూసుకోవాలని కూడా రైతులు అనుకున్నారట. అందుకనే మొత్తం వ్యవహారాన్ని పరిశీలిస్తున్నారు. వీళ్ళ ప్రయత్నమైతే చేస్తారు కానీ కోర్టు అన్ని పటీషన్లను అంగీకరిస్తుందా ? చూద్దాం చివరకు ఏమి జరుగుతుందో.