Begin typing your search above and press return to search.
ఢిల్లీ వెళ్లి తీరతాం.. రైతుల పట్టు! రెణ్ణెళ్ళ సరుకులు వెంటే!
By: Tupaki Desk | 27 Nov 2020 3:00 PM GMTకేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయబిల్లులపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వస్తున్నది. ఇప్పటికే ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల రైతు సంఘాలు ఏకమయ్యాయి. ముఖ్యంగా పంజాబ్, హర్యానాకు చెందిన రైతులు ఈ బిల్లలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తొలుత ఈ రెండు రాష్ట్రాలకే పరిమతమయిందనుకున్న ఉద్యమం క్రమంగా ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్‌కు పాకింది. నిన్న (గురువారం) రైతుసంఘాల నేతలు ‘ఛలోఢిల్లీ’కి పిలుపునిచ్చారు. దీంతో ఢిల్లీ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. టెన్షన్ వాతవారణం చోటుచేసుకున్నది. ఓ దశలో పోలీసులు రైతులపై టియర్‌గ్యాస్, జలఫిరంగులు ప్రయోగించారు.
అయినప్పటికీ రైతులు వెనక్కి తగ్గలేదు. భారీకేడ్లు తొలగించి, ఇనుపకంచెలను దాటి పోలీసులకు ఎదురెళ్లారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. అయితే రైతులు ఇంకా ఇప్పటికే అక్కడే ఉన్నారు. తాము వెనక్కి పోమని.. ఢిల్లీ చేరుకొని తీరతామని చెబుతున్నారు. రెండు నెలలకు సరిపడా ఆహారం తెచ్చుకున్నామంటున్నారు. రైతులు తమ ట్రాక్టర్లలో గ్యాస్ సిలిండర్లు, వంట సామాగ్రి, నిత్యావసర సరుకులు తీసుకొని వచ్చారు. తాము ఢిల్లీకి వెళ్లి తీరతామని భీష్మించుకు కూర్చున్నారు.
రైతులు బస్తాల కొద్ది బియ్యం - ఉల్లిగడ్డ - దుప్పట్లు - వంట సామగ్రితో వచ్చారు. మొత్తం 200 రైతుసంఘాలకు చెందిన రైతులు ఈ ఆందోళనల్లో పాల్గొంటున్నారు. పంజాబ్ - హర్యానాతోపాటు మధ్యప్రదేశ్, మహారాష్ట్రకు చెందిన రైతులు కూడా నిరసనల్లో పాల్గొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను ఏకపక్షంగా ఆమోదించిందని వారు ఆరోపిస్తున్నారు. మరోవైపు హర్యానాలో అక్కడి ప్రభుత్వం భారీగా బలగాలను మోహరించింది. ప్రస్తుతం అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది.