Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఆ కిటుకు చెబుతారా?

By:  Tupaki Desk   |   9 Sep 2015 4:17 AM GMT
కేసీఆర్ ఆ కిటుకు చెబుతారా?
X
తెలంగాణలో అన్నదాతల కడుపు మండిపోతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమ బతుకులు బంగారమవుతాయని ఆశించిన వారి ఆశల్ని నీరుకారుస్తూ.. బలవన్మరణాల దిశగా పడుతున్న అడుగులపై రైతులు గళం విప్పుతున్నారు. ఆత్మహత్యల కారణంగా పిట్టల్లా రాలిపోతున్న రైతుల గోడు పట్టించుకోని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. విదేశీ పర్యటనలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు.

సొంతంగా వ్యవసాయం చేసే ముఖ్యమంత్రి పొలం మాత్రం కోట్లాది రూపాయిలు సంపాదిస్తుంటే.. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోని రైతులు మాత్రం ఆత్మహత్యలకు పాల్పడంపై వారు గళం విప్పుతున్నారు. వ్యవసాయం ద్వారా కోట్లాది రూపాయిలు సంపాదిస్తున్న ముఖ్యమంత్రి.. అంత సంపాదన ఎలా సాధ్యమన్న కిటుకు తమకు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

‘‘ఎద్దు ఏడ్చిన చేను.. రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పటికి బాగుండదు. ముఖ్యమంత్రి నీ ఫార్మ్ హౌస్ సంపాదన కిటుకు ప్రతి రైతుకు చెప్పాలి’’ అంటూ ఫ్లెక్సీలు పట్టుకొని రైతులు నిర్వహిస్తున్న నిరసన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బీజేపీ నేతృత్వం వహిస్తున్న ధర్నాకు హాజరైన రైతులు.. తమ అసంతృప్తిని మాటలతో.. చేతలతో చూపించటం గమనార్హం.