Begin typing your search above and press return to search.

ఎన్నిక‌ల వేళ‌.. మోడీకి మ‌ళ్లీ రైతుల సెగ‌.. ఈ సారి ఏం చేస్తున్నారంటే!

By:  Tupaki Desk   |   18 Nov 2022 2:30 AM GMT
ఎన్నిక‌ల వేళ‌.. మోడీకి మ‌ళ్లీ రైతుల సెగ‌.. ఈ సారి ఏం చేస్తున్నారంటే!
X
ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి అత్యంత కీల‌క‌మైన గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో రైతులు మ‌రోసారి ఆయ‌న‌కు సెగ పెడుతున్నారు. త‌మ డిమాండ్ల సాధ‌న కోసం..దేశ వ్యాప్తంగా ఉద్య‌మించాల‌ని నిర్ణ‌యించా రు. దీంతో ఈ ప‌రిణామంపై బీజేపీ నాయ‌కులు నిశితంగా ప‌రిశీల‌న చేస్తున్నారు. రైతులకు ఇచ్చిన హామీల విషయంలో ప్ర‌ధాని మోడీ మాట తప్పార‌ని ఎస్ కే ఎం రైతు సంఘం ఆరోపించింది.

పెండింగ్లో ఉన్న రైతుల సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్తో సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్తంగా ర్యాలీలు చేపట్టేందుకు సిద్ధమైంది. నవంబర్ 26న దేశంలో ఉన్న అన్ని రాజ్‌భవన్‌లకు ర్యాలీలు నిర్వహించనున్నట్లు ఎస్కేఎం వెల్లడించింది. రైతుల డిమాండ్లను నెరవేర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని రైతు సంఘం ఆరోపించింది.

డిసెంబర్ 1 నుంచి 11 వరకు దేశంలోని అన్ని పార్టీల లోక్సభ, రాజ్యసభ సభ్యుల కార్యాలయాలకు ర్యాలీగా వెళ్లనున్నట్లు ఎస్కేఎం నేత దర్శన్ పాల్ తెలిపారు. వ్యవసాయ చట్టాల రద్దుకై పోరాడిన రైతు సంఘాలన్నీ కలిసి డిసెంబర్ 8న కర్నాల్లో.. తరవాత దశ ఉద్యమం కొరకు సమావేశం కానున్నట్లు తెలిపారు.

గత సంవత్సరం దేశవ్యాప్తంగా వివాదాస్పదమైన వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన రోజైన నవంబర్ 19వ తేదీన 'ఫతే దివస్' లేదా 'విజయ్ దివస్'గా రైతులు జరుపుకుంటారని సంయుక్త కిసాన్ మోర్చా వెల్లడించింది.

వ్యవసాయ చట్టాల రద్దు తరువాత డిసెంబర్ 9న నిరసనలు ముగించినప్పుడు రైతులకు లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీలను కేంద్రం పూర్తిగా విస్మరించిందని ఎస్కేఎం ఆరోపించింది. కనీస మద్దతు ధరపై కమిటీ వేయలేదని, ఆందోళన సందర్భంగా రైతులపై పెట్టిన 'తప్పుడు కేసుల'ను ఉపసంహరించుకోలేదని రైతు సంఘం పేర్కొంది. ఈ నేప‌థ్యంలో వీరి ప్ర‌భావం గుజ‌రాత్‌పై ప‌డ‌కుండా చూసేందుకు బీజేపీ ఏం చేయాల‌నేది అంత‌ర్మ‌థ‌నం చెందుతుండ‌డం గ‌మ‌నార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.