Begin typing your search above and press return to search.

రైతుల ట్రాక్టర్ల ర్యాలీ ... ఆ భాద్యత పోలీసులదే అన్న సుప్రీం

By:  Tupaki Desk   |   18 Jan 2021 11:12 AM GMT
రైతుల ట్రాక్టర్ల ర్యాలీ ... ఆ భాద్యత పోలీసులదే అన్న సుప్రీం
X
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ , రైతుల కోసం కొత్తగా మూడు వ్యవసాయ చట్టాలని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే , ఆ మూడు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. కేంద్రం పై ఈ ఉద్యమం నిర్విరామంగా కొనసాగుతుంది. కేంద్రం ఎన్ని చెప్పినా కూడా రైతులు ఆ మూడు చట్టాలని వెనక్కి తీసుకునేవరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అని చెప్తున్నారు. పలు ధపాలుగా కేంద్రం రైతులతో చర్చలు జరిపినా కూడా అవి సఫలం కాలేదు. ఇప్పటివరకు తొమ్మిది దశలుగా కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాల నేతల మధ్య జరిగిన చర్చలు విఫలం అయ్యాయి.

ఇక, సమస్యల పరిష్కారానికి ఓ కమిటీని ప్రకటించింది సుప్రీంకోర్టు. అది ఆలా ఉంటే .. రైతులు రోజుకో తరహాలో ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు. వారి ఆందోళనలో భాగంగా 26వ తేదీన రిపబ్లిక్‌ డే సందర్భంగా ఢిల్లీలో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, రిపబ్లిక్ డేన రైతులు నిర్వహించతలబెట్టిన ట్రాక్టర్ ర్యాలీపై ఇన్ ‌జంక్షన్ ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ పోలీసులు వేసిన పిటిషన్‌ పై తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఈ పిటిషన్ ‌పై నేడు విచారణ జరగగా, కేంద్రం తరఫున కేకే వేణుగోపాల్ వాదనలు వినిపించారు, రైతుల ర్యాలీ చట్టవిరుద్ధమవుతుంది. ఢిల్లీలోకి 5000 మంది ప్రజలు అడుగుపెట్టే అవకాశం ఉందని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇక, దీనిపై స్పందించిన సుప్రీం, ఢిల్లీలోకి ప్రవేశమనేది శాంతి భద్రతల పరిస్థితే అయితే, దానిని నిర్ధారించుకోవాల్సింది పోలీసులేనని వ్యాఖ్యానించింది. ఢిల్లీ పోలీసులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది.. గణతంత్ర దినోత్సవం దృష్ట్యా పోలీసుల అభిప్రాయం తీసుకుంటామని ఈ సందర్భంగా వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు, తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.