Begin typing your search above and press return to search.
పాక్ కు బెదిరింపా.. జనం దృష్టి మళ్లింపా?
By: Tupaki Desk | 25 Nov 2016 10:34 AM GMTడీమానిటైజేషన్ ఎఫెక్టుతో విమర్శులు ఎదుర్కొంటున్న ప్రధాని మోడీ ఇప్పటికే కొంత డిఫెన్సులో పడ్డారు. విపక్షాలన్నీ ఏకమవుతూ మోడీపై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దుతో జనం అష్టకష్టాలు పడుతున్నారంటూ గగ్గోలు పెడుతున్నాయి. ఇది ప్రజా వ్యతిరేకతను తెచ్చే ప్రమాదముండడంతో మోడీ జాగ్రత్త పడుతున్నట్లుగా కనిపిస్తోంది. డీమానిటైజేషన్ దెబ్బకు అన్ని విషయాలూ పక్కకు పోయి దేశమంతా ఇదే ఇష్యూ నడుస్తుండడంతో జనం దృష్టి మళ్లించే చర్యలకు దిగుతున్నట్లుగా కనిపిస్తోంది. అందులో భాగంగానే మళ్లీ పాక్ కు హెచ్చరికలు చేసే పని మోడీ మొదలుపెట్టినట్లుగా కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా పాక్ కు ఒక్క చుక్క నీరు కూడా వదిలిపెట్టేది లేదంటూ ఆయన తాజాగా ప్రకటించడం వెనుక ఆ దేశాన్ని బెదిరించడం కంటే భారతీయుల దృష్టి మళ్లించే లక్ష్యం దాగుందని అంటున్నారు.
పాక్ కు జీవనాధారమైన సింధు నది జలాలను ఒక్క చుక్క కూడా ఆ దేశానికి వదలమని మోడీ తాజాగా స్పష్టం చేశారు. మన దేశం నుంచి పాక్ వెళుతున్న జలాలను పూర్తిగా ఉపయోగించుకునే హక్కు ఉందని ప్రధాని తెలిపారు. సింధూ జలాలు భారత హక్కు... కానీ, పాకిస్థాన్ కు ఆ జలాలన్నీ వెళ్లిపోతున్నాయని చెప్పారు. ఈ రోజు పంజాబ్ లోని భటిండాలో ఎయిమ్స్ శంకుస్థాపన సందర్భంగా మోదీ బహిరంగసభలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. "మన దేశం నుంచి వెళుతున్న సింధు నదీ జలాలు పాక్ గుండా వెళ్లి సముద్రంలో కలుస్తున్నాయి. ఆ నీళ్లను మన రైతులకు అందించే ప్రయత్నం చేస్తాం. ఆ నీళ్లను ఒక్క చుక్క కూడా పాక్ కు వెళ్లకుండా చేస్తాం" అని మోడీ అన్నారు.
1960లో జరిగిన 'ఇండస్ ఒప్పందం' ప్రకారం రావి, బియాస్, సట్లెజ్ నదులు భారత్ కు... ఇండస్ (సింధు), జీలం, చీనాబ్ నదులు పాక్ కు దక్కాయి. ఈ అంశానికి సంబంధించి ఇరు దేశాల అధికారులూ ఉన్న 'ఇండస్ వాటర్ కమిషన్సను రద్దు చేయాలని మోడీ భావిస్తున్నారు. ఈ నదులన్నీ భారత్ మీదుగా పాకిస్థాన్ లోకి ప్రవేశిస్తున్నవే. మోడీ ఈ విషయంపై స్పష్టంగా మాట్లాడటంతో పాకిస్థాన్ లో అలజడి రేగింది. నిజంగా ఇదే జరిగితే... పాక్ లోని సారవంతమైన భూములన్నీ బీడుగా మారతాయి. అసలే పాకిస్థాన్ ఆర్థిక స్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. వారికి నీరు లేకపోతే అక్కడ పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. ఉరీ దాడి తరువాత సింధు జలాల ఒప్పందం రద్దుకు భారత్ యోచించినా ఆ తరువాత ఆ విషయం సద్దుమణిగింది. ఈలోగా డీమానిటైజేషన్ భారత్ ను అల్లకల్లోలం చేసింది. ఈ నేపథ్యంలోనే మోడీ పాక్ కు నీరు వదలబోమని చెప్పడం సంచలనంగా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/