Begin typing your search above and press return to search.

అమెరికా ఫేక్ యూనివర్సిటీ కేసులో మన విద్యార్థులకు విముక్తి

By:  Tupaki Desk   |   20 Feb 2019 2:51 PM GMT
అమెరికా ఫేక్ యూనివర్సిటీ కేసులో మన విద్యార్థులకు విముక్తి
X
అమెరికా కలలు కంటూ అక్కడకు వెళ్లేందుకు - ఉండేందుకు అడ్డదారులు తొక్కి అడ్డంగా బుక్కయిపోయిన 129 మంది భారతీయ విద్యార్థులు మరికొద్ది రోజుల్లో జైలు నుంచి విడుదల కానున్నారు. అమెరికాలో ఒక నకిలీ యూనివర్సిటీలో విద్యాభ్యాసానికి అప్లయి చేసుకుని అక్కడి ప్రభుత్వం వేసిన ట్రాప్‌లో చిక్కుకుని దొరికిపోయిన విద్యార్థుల కష్టాలు కొంతమేర తీరే రోజు రానుంది. వారంతా మరో 3 వారాల్లో విడుదల కానున్నారని అమెరికా తెలుగు అసోషియేషన్ ప్రెసిడెంట్ భువనేశ్ భుజాలా తెలిపారు.

నిజానికి తొలుత పట్టుబడ్డ 129 మంది విద్యార్థుల్లో 20 మంది ఇప్పటికే బయటపడ్డారు. మిగతా 109 మంది జైల్లో ఉన్నారు. ఇకపై అమెరికా రావాలనుకునేవారు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని.. సక్రమ మార్గాల్లోనే రావాలని భువనేశ్ చెబుతున్నారు. ట్రంప్ ఈ విషయంలో క్లియర్గా ఉన్నారని.. అక్రమంగా అమెరికా వచ్చినా.. గడువు తీరాక అక్రమంగా ఉన్నా ఇబ్బందులు తప్పవని ట్రంప్ చెప్పారని.. సక్రమ మార్గాల్లో రావాలనిభువనేశ్ అంటున్నారు.

కాగా గతంలో కూడా ఇలాంటి స్టింగ్ ఆపరేషనే చేసి అమెరికా 21 మంది అసియన్లను జైల్లో పెట్టింది .ఇప్పడు ఏకంగా 129 మందిని పట్టుకుంది. కాగా.. ఫార్మింగ్టన్‌ ఫేక్‌ యూనివర్సిటీ కేసులో అరెస్టయిన విద్యార్థులకు ఇప్పటికే కోర్టులో ఊరట లభించింది. ఫిబ్రవరి 20లోగా స్వచ్ఛందంగా స్వదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. వీరిలో ఇద్దరు భారతీయులు, ఓ పాలస్తీనియా ముందస్తుగా వాలంటరీ డిపార్చర్‌ అనుమతి పొందారు. మిగిలిన 17 మందిపై విచారణ జరిగింది. 17 మందిలో 15 మందికి అందులో 8 మంది తెలుగు విద్యార్థులకు వాలంటరీగా స్వదేశాలకు తిరిగి వెళ్లే అవకాశాన్ని కోర్టు కల్పించింది. 16వ యువతికి కూడా తిరిగి వెళ్లిపోయే అవకాశం కల్పించింది. కానీ, స్వచ్చందంగా కాకుండా ప్రభత్వం తరుపున తరలిస్తున్నట్టు యూఎస్‌ ప్రకటించింది.