Begin typing your search above and press return to search.

దేశ విభ‌జ‌న‌కు కార‌ణం నెహ్రు.. ప‌టేల్‌?

By:  Tupaki Desk   |   4 March 2018 8:00 AM GMT
దేశ విభ‌జ‌న‌కు కార‌ణం నెహ్రు.. ప‌టేల్‌?
X
త‌ర‌చూ త‌న మాట‌ల‌తో వివాదాల్ని తెర‌పైకి తీసుకొచ్చే జ‌మ్ముక‌శ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి ఫ‌రూక్ అబ్దుల్లా తాజాగా త‌న‌దైన ధోర‌ణిలో చెల‌రేగిపోయారు. తాజాగా దేశ విభ‌జ‌న‌పై ఆయ‌న వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. దేశ విభ‌జ‌న‌కు పాకిస్థాన్ జాతిపిత జిన్నా కార‌ణంగా చెబుతార‌ని.. కానీ అస‌లు కార‌ణం ఆయ‌న కాద‌న్నారు.

ఆదివారం ఒక కార్య‌క్ర‌మంలో పాల్గొన్న సంద‌ర్భంగా మాట్లాడిన ఫ‌రుక్ అబ్దుల్లా.. ఇప్ప‌టికి రికార్డుల్లో ఉన్న అంశాల ప్ర‌కారం భార‌త్ నువిభ‌జించొచ్చ‌ద్ద‌ని చెప్పార‌న్నారు.

అయిన‌ప్ప‌టికీ ముస్లింలు.. సిక్కులు వంటి మైనార్టీల కోసం ప్ర‌త్యేక ప్రాతినిథ్యం.. ప్ర‌త్యేక పాల‌నా వ్య‌వ‌స్థ‌ను కొన‌సాగించాలే కానీ.. దేశాన్ని ముక్క‌లు చేయొద్ద‌న్నార‌న్నారు. ఈ ప్ర‌తిపాద‌న‌కు జిన్నా ఓకే చెప్పార‌ని.. కానీ నెహ్రు.. ప‌టేల్‌.. మౌలానా అజాద్‌.. త‌దిత‌రులు మాత్రం వ‌ద్దంటే వ‌ద్ద‌న్నార‌న్నారు.

ఈ నేప‌థ్యంలోనే జిన్నా పాకిస్థాన్ ను డిమాండ్ చేశార‌న్నారు. నెహ్రు.. ప‌టేల్ కానీ ఒప్పుకొని ఉంటే దేశ విభ‌జ‌న జ‌రిగి ఉండేది కాద‌ని.. నేడు బంగ్లాదేశ్‌.. పాకిస్థాన్ దేశాలు ఉండేవి కాద‌ని.. భార‌త‌దేశం ఒక్క‌టే ఉండేద‌న్నారు. మ‌రి.. దీనిపై కాంగ్రెస్ నేత‌లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.